టీడీపీ తరుఫున ఎన్నికల ప్రచారం చేస్తా - స్టార్ హీరోయిన్
ఏపీలో ఎన్నికల సందడి మొదలైంది. అన్ని రాజకీయ పార్టీలు కూడా విసృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇక వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరుఫున పోటీ చేస్తానని ప్రకటించారు సీనియర్ హీరోయిన్ జయప్రద. చెక్ బౌన్స్ కేసులో అరెస్ట్ వారెంట్ జారీ కావడంతో ఒక్కసారిగా జయప్రద వార్తల్లో నిలిచారు. పుట్టినరోజు కావటంతో జయప్రద తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు . ఈ సందర్భంగా ఆమె ఏపీ రాజకీయాల గురించి స్పందించారు.
తాను ఇంకా బీజేపీలో ఉన్నానని ఆమె స్పష్టం చేశారు. అయితే వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరుఫున ప్రచారం చేయడానికి తాను సిద్దంగా ఉన్నానని జయప్రద ప్రకటించారు. జయప్రద మాట్లాడుతూ..ప్రస్తుతం నేను ఉత్తర ప్రదేశ్ లో ఉంటున్నా... ఎప్పటికీ తెలుగు బిడ్డనే.ఇక్కడ ఎన్నికలలో పోటీ చేసి ప్రజలకు సేవ చేయాలని ఉంది. బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు అంటే నాకు చాలా ఇష్టం.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా , రాజధాని లేవు. వాటికోసం పోరాడతాను.ఎవరైతే యువతకు ఉపాధి కల్పిస్తారో.. శాశ్వత రాజధాని కడతారో వారికే నా మద్దతు ఉంటుందని ఆమె తెలిపారు.

కేంద్రంలో మూడోసారి మోదీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని కోరుకుంటున్నా అని జయప్రద చెప్పుకొచ్చారు. అయితే ఏపీలో ప్రచారానికి పిలిస్తేనే వెళ్తానని..పిలవని పేరంటానికి వెళ్లనని ఈ సీనియర్ నటి స్పష్టం చేశారు. గతంలో టీడీపీ సానుభూతిపరురాలుగా ఉన్న జయప్రద ఆ తరువాత జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ములాయం సింగ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ జనతా పార్టీలో చేరి రాజ్యసభ సభ్యురాలుగా ఎన్నికయ్యారు. ఆ తరువాత సమాజ్ వాదీ పార్టీకి రాజీనామా చేసిన జయప్రద బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.












Click it and Unblock the Notifications