అంతటి దుఖంలో కూడా ప్రభాస్ సాయం చేశారంటున్న సీనియర్ రచయిత

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. ప్రస్తుతం ఆయన సినిమా లైన‌ప్ చూస్తే అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోవ‌డం ఖాయం. ఇవన్నీ ఒక వైపు అయితే ప్రభాస్ మంచితనం గురించి అందరికీ తెలిసిందే. సాధారణంగా తోటి నటీనటులకు ఫుడ్ విషయంలోనే ఫుల్ బొనాంజా ట్రీట్ ఇచ్చే ప్రభాస్.. దానం విషయంలో కూడా ఎప్పుడూ తన వంతుగా పాలుపంచుకుంటూనే ఉంటారు. అయితే కుడి చేత్తో చేసిన దానం ఎడమ చేతికి తెలియకూడదనే నానుడిని నిజం చేస్తూ ఎవరికి తెలియకుండా ఆయన చేసిన దానాలు ఎన్నో ఉన్నాయి.

సినీ కార్మికులకు, అభిమానులకు ఆపదలో సహాయం కోరిన ఎందరికో ఆయన సాయం చేశారని ఆలస్యంగా వెలుగులోకి వస్తూనే ఉంటాయి. అలానే ప్రభాస్ సాయం పొందిన వారిలో తాను ఉన్నానంటున్నారు ప్రముఖ రచయిత తోట ప్రసాద్. అంతటి దుఖంలో ఉండి కూడా ఆరోజు ప్రభాస్ తనకు సహాయం చేయడం చాలా గొప్ప విషయం అని.. ఎప్పటికీ ఆ విషయాన్ని మర్చిపోను అంటూ చెప్పడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

senior writer thota prasad shocking comments on prabhas

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తోట ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రభాస్ చాలా గొప్ప మనసు ఉన్న వ్యక్తి. ఆయన నటించిన బిల్లా సినిమాకి నేను రచయితగా చేశాను. ఆ కొద్దిపాటి పరిచయంతోనే ఆయన నాకు ఎప్పటికీ మర్చిపోలేని సహాయం చేశాడు. నేను 2010లో అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నాను. అయితే నేను హాస్పిటల్లో ఉన్న సంగతి తెలుసుకున్న ప్రభాస్.. వైద్యానికి అవసరమయ్యే డబ్బు పంపించారు. అయితే చాలా మంది మంచి మనసున్న వారు సాయం చేస్తున్నారు కానీ .. నాకు సాయం చేసిన రోజే ప్రభాస్ తండ్రి ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు కన్ను మూశారు. ఆ దుఃఖంలోనూ ప్రభాస్ తన గొప్ప మనసు చాటుకోవడం మర్చిపోలేను అంటూ ఎమోషనల్ అయ్యారు.

గతంలో ఆయన ప్రభాస్ నటించిన బిల్లా సినిమాకు ఆయన రచయితగా పనిచేశారు. మళ్లీ ఇప్పుడు కన్నప్ప సినిమా ద్వారా ప్రభాస్ తో కలిసి పని చేస్తున్నారు తోట ప్రసాద్. ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం మారుతితో రాజా సాబ్‌.. హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమా..సందీప్ రెడ్డితో స్పిరిట్.. ఆ తర్వాత సలార్ 2, కల్కి 2.. చిత్రాలలో నటించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+