విజయ్- రష్మిక పెళ్లి వేళ 'అర్జున్ రెడ్డి' హీరోయిన్ పోస్ట్ వైరల్..

థియేటర్లలోకి సినిమాలు వస్తుంటాయి.. పోతుంటాయి.. కానీ కొన్ని సినిమాలు మాత్రం అటు ప్రేక్షకులు, ఇటు బాక్సాఫీస్ పై చెరగని ముద్రను వేస్తుంటాయి. ఒక్కో జనరేషన్ కు ఒక్కో సినిమా అన్నట్టు ఈ జనరేషన్ లో మర్చి పోలేని మూవీ "అర్జున్ రెడ్డి".. టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవర కొండ ఏ ముహూర్తాన ఈ సినిమాను ఓకే చేశారో గానీ ఈ మూవీ ఆయన కెరీర్ నే కాకుండా యావత్ తెలుగు చిత్ర సీమకే కొత్త సినిమాను పరిచయం చేసింది. అర్జున్ రెడ్డి తర్వాత చాలా సినిమాలు ఇదే బ్యాక్ డ్రాప్ లో వచ్చాయి. కానీ అర్జున్ రెడ్డి రేంజ్ ను మాత్రం అందుకోలేక పోయాయి.

అర్జున్ రెడ్డి మూవీని సందీప్ రెడ్డి వంగా ఎలాగైతే ప్రాణం పెట్టి తీశాడో.. విజయ్ దేవరకొండ కూడా అంతే ప్రాణం పెట్టి పనిచేశాడు. వీళ్లిద్దరి కష్టం స్క్రీన్ పై కనపడుతుంది. అందుకే వాళ్లిద్దరూ ఇప్పుడు ఎవరూ ఎదగనంత స్థాయికి ఎదిగారు. చాలా మంది హీరోలకు ఓ ఐదారు సినిమాలు చేస్తే గానీ రాని స్టార్ డమ్.. క్రేజ్ విజయ్ కు ఒక్క సినిమాతోనే రావడం అంటే మామూలు విషయం కాదు.. ఈ సినిమా అంతలా అందరినీ మార్చేసింది. ఇదంతా సందీప్ రెడ్డి, విజయ్ దేవరకొండ పడిన కష్టానికి ప్రతిఫలం అని చెప్పొచ్చు.

2017లో భద్రకాళి పిక్చర్స్ పతాకంపై వచ్చిన ఈ సినిమా కథ పరంగా, రన్ టైమ్ పరంగా, మ్యూజిక్ పరంగా, డైరెక్షన్ పరంగా ఎన్నో రికార్డులను నెలకొల్పింది. ఈ మూవీలో విజయ్ సరసన హీరోయిన్ గా నటించిన షాలినీ పాండే గురించి చెప్పుకోవాలి. ప్రీతి క్యారెక్టర్ లో ఆమె జీవించారనే చెప్పాలి. అలా ఆన్ స్క్రీన్ పై విజయ్- షాలినీ కెమిస్ట్రీ కుదిరింది కాబట్టే సినిమా ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఈ మూవీని కేవలం రూ. 5 కోట్ల బడ్జెట్ తో తీశారు. కానీ బాక్సాఫీస్ వద్ద రూ. 50 కోట్లకుపైగా కలెక్ట్ చేసింది.

ShaliniPandey Actress Viral Post on insta Vijay-Rashmika Wedding Fans Go Crazy Over Her Words

ఇదే సినిమాను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కబీర్ సింగ్ పేరుతో షాహిద్ కపూర్ హీరోగా, కియారా అద్వానీ హీరోయిన్ గా తెరకెక్కించాడు. అక్కడ కూడా ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. అయితే అర్జున్ రెడ్డి సమయంలో విజయ్- షాలినీ కెమిస్ట్రీపై అనేక రూమర్స్ వచ్చాయి. ఇక వీళ్లిద్దరూ కలిసి మహానటి సినిమాలోనూ నటించారు. అయితే తాజాగా విజయ్, రష్మిక పెళ్లి చేసుకున్న నేపథ్యంలో షాలినీ పాండే తన ఇన్ స్టా గ్రామ్ లో పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది. ఆమె ఓ నది వద్ద ఒంటరిగా సేద తీరుతూ ఉండటం చూడొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+