ఆ మూవీ చూశాక నాకు నిద్ర పట్టలేదు: సూపర్ స్టార్ ఎమోషనల్ కామెంట్స్
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఇటీవల వరుస సినిమాలతో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. అలాగే బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ కొడుతూ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నారు. గతేడాది, అంతకుముందు సూర్య కు వరుస ప్లాఫ్స్ వచ్చాయి. భారీ అంచనాలతో వచ్చిన కంగువ డిజాస్టర్ అయింది. ఆ తర్వాత రెట్రో మూవీ కూడా ఆశించినంత విజయాన్ని సాధించలేదు. దాంతో సూర్య ఫ్యాన్స్ నిరాశలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది వచ్చిన కరుప్పు మూవీ తెలుగులో వీరభద్రుడు బ్లాక్ బస్టర్ అయింది. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ థియేటర్లలో వసూళ్ల పరంపర కొనసాగించింది. కరుప్పు మూవీ హిట్ తో సూర్య కెరీర్ మళ్లీ బ్యాక్ టూ ఫామ్ లోకి వచ్చింది. కరుప్పు మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. ఆ తర్వాత ఇటీవల వచ్చిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.
టాలీవుడ్ సక్సెస్ ఫుల్ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. ఈ మూవీలో సూర్య సరసన యంగ్ అండ్ టాలెంటెడ్ మలయాళం బ్యూటీ మమితా బైజు హీరోయిన్ గా నటించింది. అలాగే సీనియర్ నటి రాధిక ఈ మూవీలో కీలక పాత్ర పోషించారు. అద్భుతమైన కథాంశంతో ఈ మూవీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆగస్టు 14న విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్లకుపైగా కలెక్షన్స్ వచ్చాయి. ఇటీవల థియేట్రికల్ రన్ ను పూర్తి చేసుకున్న 'విశ్వనాథ్ అండ్ సన్స్' మూవీ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే తాజాగా ఈ మూవీని కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ వీక్షించారు. ఆ తర్వాత సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు.

ఈ కుటుంబ కథా చిత్రాన్ని చూసిన తర్వాత తాను ఎంతో భావోద్వేగానికి లోనయ్యానని పేర్కొన్నారు. 'విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా చూశాక నాకు గంటసేపటి వరకూ నిద్ర పట్టలేదు. ఈ సినిమా మా అమ్మానాన్నలను, కుటుంబాన్ని గుర్తుచేసింది. కళ్లలో నీళ్లతో దాని గురించే ఆలోచిస్తూ పడుకున్నాను. బహుశా నేను తీవ్ర భావోద్వేగానికి లోనయ్యానేమో.. భవిష్యత్తులో అలాంటి సినిమా ఒకటి చేయాలని కూడా నేను కోరుకుంటున్నా.. అని కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఇక ప్రస్తుతం శివ రాజ్ కుమార్ భైరతి రణగల్ అనే మూవీ ప్రొమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ అక్టోబర్ 2 న థియేటర్లలో విడుదల కానుంది.












Click it and Unblock the Notifications
