కాల్ గర్ల్ గా మారిన తెలుగు హీరోయిన్?
మన తెలుగమ్మాయి.. తెనాలి అమ్మాయి శోభిత ధూళిపాళ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరంలేదు. గూఢచారి సినిమాతో వెండితెరకు పరిచయమై తన అందం, అభినయంతో పాటు ఈ ముద్దుగుమ్మ అందరినీ ఆకట్టుకుంది. టాలీవుడ్, బాలీవుడ్‌లో సినిమాలు చేస్తూ తనదైన శైలిలో కెరీర్ పరంగా బిజీగా మారిపోయింది. 2013లో జరిగిన మిస్ ఇండియా పోటీల్లో రన్నరప్ గా నిలిచింది. ప్రస్తుతం శోభితకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తాజాగా శోభిత మంకీ మ్యాన్ హాలీవుడ్ సినిమాలో వేశ్య పాత్రలో నటించింది. ఆ సినిమా ఈనెల ఐదోతేదీన అమెరికాలో విడుదలైంది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శోభితన ఆ పాత్రలో నటించడంపై తన అనుభవాలను వివరించింది. పాత్రకు మంచి స్పందన వచ్చిందని, సీత అనే వేశ్య పాత్రలో నటించానని, అది చేయడం తనకు ఎంతో గర్వంగా అనిపించిందన్నారు. తన పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉందని, ఈనెల 26న ఇండియాలో విడుదల కాబోతోందన్నారు. తన పాత్ర ఇక్కడ కూడా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉందన్నారు. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

1993, మే 31న వేణుగోపాల్ రావు, శాంతరావు దంపతులకు శోభిత తెనాలిలో జన్మించింది. విశాఖపట్నంలో లిటిల్ ఏంజెల్స్ స్కూల్, విశాఖ వ్యాలీ స్కూల్ లో విద్యనభ్యసించిన తర్వాత శోభిత ముంబయి విశ్వవిద్యాలయం, హెచ్.ఆర్ కాలేజ్ లో కామర్స్ & ఎకనామిక్స్ పూర్తి చేసింది. సంప్రదాయ నృత్యాలైన భరతనాట్యం, కూచిపూడి లలో శిక్షణ తీసుకుంది.
2016లో అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన రామన్ రాఘవ్ 2.0 లో తొలిసారిగా వెండితెరకు పరిచయం అయింది. అడివి శేష్ హీరోగా మహేశ్ బాబు నిర్మించిన మేజర్ సినిమాలో శోభిత కీలక పాత్ర పోషించింది. 2022 జూన్ 3న విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ప్రస్తుతం అక్కినేని నాగచైతన్యతో సన్నిహితంగా ఉందంటూ కొంతకాలం నుంచి వార్తలు వస్తున్నాయి. వాటిని నాగచైతన్య ఖండించారు.












Click it and Unblock the Notifications