పెళ్లి అవకముందే నాగార్జున-అమలకు బిగ్ షాక్ ఇచ్చిన శోభిత
సమంతకు విడాకులిచ్చేసిన తర్వాత అక్కినేని నాగచైతన్య కొంతకాలం ఒంటరిగా ఉన్నారు. ఆ తర్వాత నటి శోభిత ధూళిపాళను ప్రేమించారు. అయితే సమంతతో విడాకులు తీసుకోవడానికి ముందే అతను శోభితను ప్రేమించాడంటూ వార్తలు వచ్చాయి. ఆగస్టు 8వ తేదీన నాగార్జున ఇంట్లో నాగచైతన్యకు శోభితతో నిశ్చితార్థం జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలను నాగార్జున ట్విటర్ లో పెట్టడంతో అందరూ షాక్ అయ్యారు. నాగచైతన్య-సమంత ఎప్పటికైనా కలవకపోతారా? వారిద్దరిదీ గట్టి అనుబంధం అనుకుంటూ ఉన్న అభిమానులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు.
నాగచైతన్య అంగీకరించినట్లు తెలుస్తోంది
పెళ్లి తేదీ ప్రకటించనప్పటికీ ఇటీవలే శోభిత పసుపు దంచే పనులకు సంబంధించిన ఫొటోలను షేర్ చేసింది. తాను ఎక్కువగా బాలీవుడ్ లో సినిమాలు చేస్తుంటుంది కాబట్టి ముంబయిలో ఇల్లు కొనుగోలు చేసి అక్కడే నివాసం ఉంటోంది. సినిమా అవకాశాలు కూడా ఎక్కువగా బాలీవుడ్ నుంచే వస్తుంటాయి కాబట్టి నాగచైతన్యతో వివాహమైన తర్వాత ముంబయిలో ఉందామనుకుంటోంది. ఇదే విషయాన్ని నాగచైతన్యతో చెప్పగా అతను కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి సమంత, తాను కలిసివున్న ఫ్లాట్ లో ఉందామని శోభితతో నాగచైతన్య చెప్పినప్పటికీ ఆమె ఒప్పుకోలేదు. ఆ ఫ్లాట్ లో ఉంటే మాజీ భార్యకు సంబంధించిన జ్ఞాపకాలే వస్తుంటాయని, అక్కడ వద్దని చెప్పేసింది.

కుటుంబ పెద్దలు కూడా ఏమీ మాట్లాడలేని పరిస్థితి
తాజాగా ముంబయిలో కాపురం పెట్టడానికి నాగచైతన్య కూడా ఒప్పుకోవడంతో నాగార్జున-అమకు గట్టి షాక్ ఇచ్చినట్లైందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. పెళ్లి అవకముందే విడిగా, అందులోను హైదరాబాద్ కాకుండా ముంబయిలో ఉందామనే శోభిత నిర్ణయాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. నాగచైతన్య కూడా అంగీకరించాడు కాబట్టి వారేమీ మాట్లాడలేదు.
సినిమా షూటింగ్ ల కోసం శోభిత హైదరాబాద్ నుంచి ముంబయి తిరగడంకన్నా నాగచైతన్య ముంబయి నుంచి హైదరాబాద్ తిరగడం బెటర్ అనే అభిప్రాయానికి కాబోయే భార్యాభర్తలిద్దరూ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో కుటుంబ పెద్దలు కూడా ఏమీ మాట్లాడలేని పరిస్థితి. ముంబయికి వెళితే నాగచైతన్య అక్కినేని కుటుంబానికి దూరమైనట్లేనని ప్రచారం నడుస్తోంది. అయితే ఇదంతా వట్టి రూమర్ అంటూ అక్కినేని అభిమానులు కొట్టిపారేస్తున్నారు.












Click it and Unblock the Notifications