బిగ్ షాక్ : బాలయ్య- గోపిచంద్ మలినేని మూవీ స్టోరీ ఛేంజ్..!
నందమూరి బాలకృష్ణ.. స్వర్గీయ ఎన్టీఆర్ తనయుడిగా చిత్రసీమలోకి ఎంట్రీ ఇచ్చినా.. తనదైన శైలిలో రాణించి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి 'డాకు మహరాజ్'తో హిట్ అందుకున్న ఆయన.. మొత్తంగా వరుసగా నాలుగు సినిమాలు హిట్ కొట్టి ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన "అఖండ 2" చిత్రంతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నారు.
కాగా పలు కారణాలతో పలుమార్లు వాయిదా పడ్డ ఈ మూవీ.. మొత్తానికి అభిమానులను, సినీ ప్రేమికుల ఆకలి తీర్చింది అని చెప్పాలి. డిసెంబర్ 12న ఆడియన్స్ ముందుకు రాగా.. మంచి పాజిటివ్ టాక్ తో మంచి హిట్ గా నిలిచింది. 'అఖండ' మూవీకి సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రంలో.. సంయుక్త హీరోయిన్ గా నటించింది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ మూవీని నిర్మించారు. బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని సహ నిర్మాతగా వ్యవహరించారు.

ఈ క్రమంలోనే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన నెక్స్ట్ సినిమాని అనౌన్స్ చేశారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ ప్రాజెక్ట్.. ఎన్బీకె 111 వర్కింగ్ టైటిల్‌తో త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. వృధ్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించి పోస్టర్ ని రిలీజ్ చేశారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభం కానుండగా.. బాలకృష్ణ మరోసారి ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. పిరియాడికల్ మైథాలజీ కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందించబోతున్నారు. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో వచ్చిన వీర సింహారెడ్డి హిట్ కొట్టడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే సోషల్ మీడియాలో నడుస్తున్న టాక్ ప్రకారం.. ఈ మూవీ మాస్ యాక్షన్ అంశాలతో పాటు.. హిస్టారికల్ కాన్సెప్ట్ తో రాబోతుందని టాక్ వినిపిస్తుంది. చరిత్రను, వర్తమానాన్ని ముడిపెడుతూ ఎపిక్ స్టోరీతో.. టైమ్ ట్రావెల్ కథలా ఉంటుందని అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లకుండానే.. కథ మారినట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ వ్యవహారం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది.
ప్రస్తుతం హిస్టారికల్ కథను పక్కన పెట్టి మరో కొత్త కథతో సినిమాను చేయబోతున్నట్టుగా చర్చ నడుస్తోంది. ఆ స్టోరీతో టైమ్ పడుతుందని, బడ్జెట్ కూడా ఎక్కువ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారట. దాంతో గోపీచంద్ బాలయ్యకు మరో కొత్త లైన్‌ను వినిపించగా.. ఆయన ఓకే చెప్పారని భావిస్తున్నారు. కానీ కొంతమంది మాత్రం హిస్టారికల్ కథలోనే కొన్ని మార్పులు చేస్తున్నట్టుగా చెబుతున్నారు. మరీ దీనిపై క్లారిటీ రావాలంటే మూవీ యూనిట్ అనౌన్స్ మెంట్ వచ్చే వరకు ఆగక తప్పదు.












Click it and Unblock the Notifications