మన హీరోయిన్లు ఎన్ని రూ.కోట్లు కూడబెడుతున్నారో తెలుసా?
వాస్తవానికి సినీ పరిశ్రమలో హీరోలతో పోల్చుకుంటే హీరోయిన్ల కెరీర్ చాలా తక్కువగా ఉంటుందనే విషయం తెలిసిందే. వారికి అవకాశాలు రావడం అనేది ప్రతిభ, అదృష్టం మీద ఆధారపడివుంటాయి. త్రిష, సమంత, నయనతార లాంటివారు ఏళ్లకు ఏళ్లు హీరోయిన్లుగా రాణించడమేకాదు.. బాలీవుడ్ హీరోయిన్లకు తీవ్ర పోటీనిస్తున్నారు. దక్షిణాదిలోని మన హీరోయిన్లు రూ.కోట్లకు రూ.కోట్లు కూడబెడుతున్నారు. 2024 వరకు మన హీరోయిన్లు ఎలా రాణించారు? ఎంత కూడబెట్టారనేది తెలుసుకుందాం.
నయనతార
దక్షిణాదిలో అత్యంత సంపన్న నటి. ఆమె ఆస్తుల విలువ రూ.300 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. హైదరాబాద్, చెన్నై, కేరళ, ముంబయిలాంటి నగరాల్లో రూ.100 కోట్లకుపైగా విలువచేసే నాలుగు లగ్జరీ ఇళ్లు, 4 BHK ఇల్లు ఉంది. ఒక్కో సినిమాకు రూ.12 నుంచి రూ.13 కోట్ల వరకు తీసుకుంటోంది. జవాన్ తర్వాత పారితోషికాన్ని భారీగా పెంచింది.

అనుష్క
ఆమె ఆస్తుల విలువ రూ.135 కోట్ల వరకు ఉంటుందంటారు. బాహుబలి తర్వాత మిస్ శెట్టి - మిస్టర్ పోలిశెట్టి చిత్రం చేసింది. ప్రస్తుతం మళయాళంలో కత్నార్ - ది వైల్డ్ సోర్సెరర్‌లో నటిస్తోంది. ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు పారితోషికం తీసుకుంటుంది.
తమన్నా
సంపన్న హీరోయిన్ల జాబితాలో మూడోస్థానంలో నిలిచింది. సినిమాకు రూ.2 నుంచి రూ.5 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటోంది. వెబ్ సిరీస్ లో ఎక్కువగా నటిస్తోంది. దాదాపు 18 సంవత్సరాల నుంచి పరిశ్రమలో కొనసాగుతోంది. ఆస్తుల విలువ రూ.150 కోట్లకు పైగా ఉంటుందంటున్నారు.
సమంత
సినిమాకు రూ.7 నుంచి రూ.8 కోట్ల వరకు తీసుకుంటుంది. ప్రకటనలు ఎక్కువగా చేస్తుంటుంది. వెబ్ సిరీస్ లు కూడా చేస్తోంది. ప్రస్తుతం సిటాడెల్ సిరీస్ లో నటిస్తోంది. ఇటీవలే సొంత నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించింది. ఆస్తుల విలువ రూ.100 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది.
త్రిష
రెండు దశాబ్దాల నుంచి హీరోయిన్ గా రాణిస్తోంది. ప్రస్తుతం ఎంతో బిజీగా ఉంది. త్రిష గ్లామర్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. సినిమాకు రూ.6 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు తీసుకుంటుంది. ఆస్తుల విలువ రూ.90 నుంచి రూ.100 కోట్లుగా ఉంటుంది.












Click it and Unblock the Notifications