మహేష్ బాబు-రాజమౌళి మధ్య గొడవ..మొత్తం చెడగొట్టావు అంటూ..!
సూపర్ స్టార్ మహేష్ బాబు , దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న "SSMB 29" సినిమా గురించి భారతీయ సినిమా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌పై నవంబర్‌లో అప్‌డేట్ ఇస్తానన్న రాజమౌళి మాట నిలబెట్టుకోకపోవడంతో.. మహేష్ బాబు స్వయంగా రంగంలోకి దిగారు.
నవంబర్ మొదటి రోజున మహేష్ బాబు, రాజమౌళిని ట్యాగ్ చేస్తూ, "సార్, నవంబర్ వచ్చేసింది.. అప్‌డేట్ ఎక్కడ?" అంటూ సరదాగా ట్వీట్ చేశారు. ఈ ఒక్క ట్వీట్‌తో సోషల్ మీడియాలో ఒక్కసారిగా సందడి మొదలైంది.

మహేష్ ట్వీట్‌కు రాజమౌళి కూడా అంతే చమత్కారంగా బదులిచ్చారు. నవంబర్ వచ్చింది మహేష్, ఈ నెలలో ఏ సినిమాకి రివ్యూలు ఇవ్వాలని అనుకుంటున్నావు? అని అడిగారు. దానికి సూపర్ స్టార్ మరింత పంచ్‌గా మీరు తీస్తున్న మహాభారతానికి రివ్యూ ఇస్తాను సార్ అంటూ రివర్స్ ఎటాక్ చేశారు.
ఈ సరదా ట్వీట్ల యుద్ధంలో ఊహించని విధంగా ఇతర స్టార్స్ కూడా చేరారు.బాలీవుడ్ గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోక్యం చేసుకుని, హీరో.. నువ్వు నాతో చెప్పిన కథలన్నీ లీక్ చేయాలా? అంటూ ట్వీట్ చేయగా, రాజమౌళి వెంటనే ప్రియాంక నటిస్తుందనే సీక్రెట్‌ని బయటపెట్టావ్ మహేష్ అని కామెంట్ చేశారు. దీంతో ప్రియాంక ఈ సినిమాలో ఉందనే వార్తలకు బలం చేకూరింది.
మలయాళం స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా బరిలోకి దిగి రాజమౌళి సార్, నేను హైదరాబాద్ వస్తే నా ఫ్యామిలీ అనుమానిస్తుంది అంటూ ఫన్నీగా ట్వీట్ చేయడంతో, అభిమానులు తెగ నవ్వుకున్నారు.
చివరికి, మహేష్ బాబు ఇప్పుడైనా రేపు ఒక అప్‌డేట్ ప్రకటించండి సార్ అని పట్టుబట్టగా, రాజమౌళి ఒక షరతుతో డీల్ ఓకే.. కానీ వ్యంగ్యానికి జరిమానా - నీ ఫస్ట్ లుక్ ఆలస్యం అంటూ ఈ సరదా సంభాషణకు ముగింపు పలికారు.
ఈ మొత్తం ట్వీట్ సిరీస్‌తో #SSMB29Update హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్‌లోకి దూసుకుపోయింది. అప్డేట్ ఇవ్వకపోయినా, రాజమౌళి తన సోషల్ మీడియా ప్రమోషన్‌తో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌పై ప్రేక్షకులలో ఆసక్తిని అమాంతం పెంచేశారు. టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం, ప్రియాంక చోప్రా మరియు పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ భారీ ప్రాజెక్ట్‌లో భాగం కావడం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications