పవన్ కల్యాణ్ వద్దన్న కథతో స్టార్ హీరో ఇండస్ట్రీ హిట్
కొణిదెల పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఐదు శాఖల బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సినిమాల్లోకి ప్రవేశించిన మొదట్లో చేసినవన్నీ ప్రేమ కథా చిత్రాలే ఉండేవి. ఒకరకంగా లవ్ స్టోరీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు. గోకులంలో సీత, సుస్వాగతం, తొలిప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషిలాంటివన్నీ ప్రేమ కథలే. యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. అంతగా పవన్ కల్యాణ్ హవా నడిచింది. ఇటువంటి సమయంలోనే ఒక ప్రేమ కథ పవన్ కల్యాణ్ దగ్గరకు వచ్చింది. కానీ అతను చేయననడంతో మరో హీరో చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు.
ఖుషీ.. సంచలన విజయం
ఆ సినిమా ఏదంటే నువ్వే కావాలి. తరుణ్, రిచా హీరో హీరోయిన్లుగా వచ్చిన ఆ సినిమా అప్పట్లో పెద్ద సంచలనాన్ని నమోదు చేసింది. వాస్తవానికి ఈ కథ ముందుగా పవన్ కల్యాణ్ దగ్గరకే వెళ్లింది. ఎస్‌జే సూర్య దర్శకత్వంలో అమీషాపటేల్ హీరోయిన్ గా రెండు షెడ్యూల్స్ పూర్తిచేసుకుంది. తర్వాత ఈ సినిమా ఆగిపోయింది. కొద్దిరోజులు గడిచిన తర్వాత పట్టాలెక్కించాలని చూశారుకానీ పవన్ వద్దనడంతో అది అలాగే ఉండిపోయింది. తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో ఖుషీ విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. అయితే ఆ ఆగిపోయిన సినిమా కథనే దర్శకుడు విజయ్ భాస్కర్ నువ్వేకావాలిగా తెరకెక్కించారు.

రామోజీరావు, రవికిషోర్ నిర్మించారు
మయూరి, స్రవంతి బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. రామోజీరావు, స్రవంతి రవికిషోర్ నిర్మాతలుగా వ్యవహరించారు. విజయ్ భాస్కర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో స్వయంవరం తర్వాత వచ్చిన రెండో సినిమా నువ్వే కావాలి. రూ.1.2 కోట్ల వ్యయంతో రూపుదిద్దుకొని రూ.36 కోట్లు వసూలు చేసింది. కొన్ని ప్రాంతాల్లోని థియేటర్లలో 300 రోజులకు పైగా ఆడింది. ఈ సినిమాతో తరుణ్ స్టార్ హీరోగా మారిపోయారు. నువ్వేకావాలి, ప్రియమైన నీకు, నువ్వులేక నేనులేను, నీ మనసు నాకు తెలుసు లాంటి సినిమాలన్నీ విడుదలై ఘనవిజయాన్ని నమోదు చేశాయి.












Click it and Unblock the Notifications