సుడిగాలి సుధీర్ 1 మినిట్ వీడియో వైరల్.. నీ కష్టం పగోడికీ రావొద్దు భయ్యా..!

సినిమా ఇండస్ట్రీ అంటే రంగుల ప్రపంచం. కానీ ఆ చిత్ర సీమలో చిన్న అవకాశం కోసం ఎన్నో నిద్ర లేని రాత్రులు, తిండి తిప్పలు మాని అవకాశం కోసం ఎదురు చూసే వారు ఎందరో.. సినిమాల్లోకి రావడం అనేది ఎప్పుడూ కష్టమైనదే. టాలెంట్ ఉన్నా ఎన్నో అవరోధాలను దాటుకుని నిలబడి సక్సెస్ అయిన వారు చాలామందే ఉంటారు. అలాంటి వారిలో సుడిగాలి సుధీర్ ఒకరు. సుడిగాలి సుధీర్ అనగానే చాలా మందికి జబర్దస్త్ ప్రోగ్రాం గుర్తొస్తుంది. ప్రేక్షకుల్ని నవ్వించడానికి ఆయన ఎన్నో కష్టాలు పడ్డాడు.

తెర మీద ప్రేక్షకుల్ని నవ్వించేందుకు ఎలాంటి పాట్లు పడ్డా కూడా తెర వెనుక మాత్రం ఎంతో ఎమోషనల్ వ్యక్తి సుడిగాలి సుధీర్ . బంధాలు, బంధుత్వాలు, ప్రేమకు ఆయన ఎంతో విలువిస్తాడు. కుటుంబాన్ని చక్కగా చూసుకుంటాడు. తల్లిదండ్రులను ఎంతో ప్రేమిస్తాడు. అయితే సినిమాల్లోకి రాకముందు సుడిగాలి సుధీర్ ఎన్నో కష్టాలు పడ్డట్లు ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

SudigaliSudheer Breaks Down in Tears While Recounting His Life Struggles Emotional Video Sudigali

" నేను గతంలో రామోజీ ఫిల్మ్ సిటీలో మెజిషియన్ గా పనిచేశాను. మా నాన్నకు యాక్సిడెంట్ అయిందని ఇంటర్ మధ్యలోనే మానేసి వచ్చేశాను. అక్కడే ఉండి ఎక్కువ రోజులు పని చేశాను. నో లీవ్స్. సండే, హాలీడేస్ లో ఎక్కువగా పబ్లిక్ వచ్చేవాళ్లు. దాంతో ఎక్కువ పని ఉండేది. ఫ్యామిలీతో ఉండేందుకు కుదిరేది కాదు. ఫస్ట్ శాలరీ తీసుకున్న తర్వాత సంక్రాంతికి విజయవాడ వెళ్లా. నా ఫస్ట్ శాలరీ 8 వేలతో అమ్మనాన్నలు తమ్ముడికి బట్టలు కొన్నా. అలా ఫిల్మ్ సిటీ వద్ద లారీలు ఎక్కి విజయవాడ వెళ్లేవాడ్ని. మళ్లీ మధ్యాహ్నం ఇక్కడికి వచ్చి డ్యూటీ జాయిన్ అయ్యే వాడిని" అని చెప్పుకుంటూ సుడిగాలి సుధీర్ ఎమోషనల్ అయ్యాడు. దాంతో అక్కడున్న జడ్జెస్ కూడా ఒక్కసారిగా ఏడ్చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

ఇక సుడిగాలి సుధీర్ ప్రస్తుతం బుల్లితెరపై తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు. అంతేకాకుండా ఇప్పుడు వెండితెరపై హీరోగా వరుస అవకాశాలు అందుకుంటున్నాడు. ప్రస్తుతం ఆయన గోట్ అనే సినిమా చేశాడు. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+