ఖాళీగా ఉండటంతో చీరల షాపులకు వెళుతున్న మహేష్ బాబు
సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రరాజం తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ఇంత దారుణమైన సినిమాను మహేష్ బాబుకు ఇస్తావా? అంటూ అభిమానులు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై మండిపడ్డారు. అప్పటినుంచి ఇప్పటివరకు త్రివిక్రమ్ మీడియా ముందుకు రాలేదు. తర్వాత సినిమా అల్లు అర్జున్ తో చేయనుండటంతో దీనికి సంబంధించిన ఏర్పాట్లలో ఉన్నారు. అల్లు అర్జున్ తో అయితే ఒకరకంగా, మహేష్ బాబుతో అయితే మరోరకంగా సినిమాలు తీస్తావా? అంటూ నెటిజన్లు ఇప్పటికీ త్రివిక్రమ్ ను ఆడుకుంటున్నారు.
మూడు భాగాలుగా రాబోతున్న సినిమా
రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ మూవీని మహేష్ బాబు చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొత్తం మూడు భాగాలు రాబోతున్న ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. బడ్జెట్ రూ.1500 కోట్ల నుంచి రూ.1700 కోట్లు అవుతోంది. రాజమౌళితో సినిమా అంటే దాదాపుగా మూడు సంవత్సరాలను మహేష్ బాబు కోల్పోయినట్లే. అందుకే అతని భార్య నమత్ర శిరోద్కర్ ప్రిన్స్ తో వాణిజ్య ప్రకటనలు చేయిస్తోంది. ప్రస్తుతం నమత్రకు సంబంధించిన ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది.

నమ్రతపై విరుచుకుపడుతున్న అభిమానులు
ఖాళీగా ఉండటంతో నమ్రత మహేష్ బాబును చీరల షాపుల ఓపెనింగ్ కు తీసుకువెళుతోంది. గుంటూరు కారం విడుదలైన తర్వాత నుంచి ఇప్పటివరకు ఉన్న ఖాళీ సమయంలో నమ్రత మహేష్ బాబుతో 50 వాణిజ్య ప్రకటనలను చేయించినట్లు తెలుస్తోంది. ఖాళీగావున్నాడు కదా అని చీరల షాపుల ప్రారంభోత్సవానికి తీసుకువెళుతూ ప్రిన్స్ స్థాయిని దిగజారుస్తావా? పాన్ వరల్డ్ హీరో కాబోతున్న మహేష్ బాబుతో నువ్వు చేయించేది ఈ యాడ్సా.. డబ్బులకు ఇబ్బంది లేదుగా.. ఎందుకీ ప్రయత్నాలు అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబును నమ్రత అమ్మకానికి పెట్టిందంటూ అభిమానులు మండిపడుతున్నారు. ఈ విషయంలో అభిమానులంతా ఏకగ్రీవంగా నమత్రపై విరుచుకుపడుతున్నారు.












Click it and Unblock the Notifications