యంగ్ బ్యూటీతో మహేష్ బాబు లిప్ లాక్?
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా చేస్తున్నారు. ఈ సమయానికి షూటింగ్ మొత్తం పూర్తవ్వాల్సి ఉండగా అనుకోని కారణాలవల్ల ఇది వాయిదా పడుతూ రావడమేకాక పడుతూ లేస్తూ షూటింగ్ జరుపుకుంటోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతోంది. దీని తర్వాత రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమా షూటింగ్ ప్రారంభమవడానికి ఎక్కువ సమయం ఉండటంతో రాజమౌళి చిత్రంకన్నా ముందుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేయాలని ప్రిన్స్ భావిస్తున్నారు. దీనికి సంబంధించి అధికారికంగా వార్త రావాల్సి ఉంది.
ప్రస్తుతం చేస్తున్న గుంటూరు కారం సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లు. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల మహేష్ కు మరదులుగా నటిస్తోంది. వీరిద్దరి మధ్య కొన్ని రొమాంటిక్ సన్నివేశాలుంటాయని తెలుస్తోంది. ఏదైనా ఒక సినిమాలో లిప్ లాక్ లేదంటే హాట్ సీన్స్ పడిందంటే కుర్రాళ్లు సినిమాను సూపర్ హిట్ చేస్తున్నారు. ప్రిన్స్ సినిమాలో అలాంటి సీన్ ఉందన్న విషయం లీకై వైరల్ గా మారింది. మహేష్ తన మరదలుగా నటిస్తున్న శ్రీ లీలతో ఓ లిప్ లాక్ సీన్ చేస్తారట. లిప్ లాక్ కంటే ఏదో గాఢంగా లిప్ లాక్ పెట్టుకునేటట్లు కాకుండా జస్ట్ తన లిప్స్ ను శ్రీలీల లిప్స్ తో టచ్ చేస్తారట .

మహేష్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన అతడు సినిమాలో కూడా త్రిషతో అలాంటి సీన్ చేశాడు. శ్రీలీలతో బావ మరదళ్ల తగాదాల్లో భాగంగా లిప్ లాక్ ఒకటి ఉంటుందట. దీనిపై నెటిజన్లు మహేష్ బాబును ట్రోల్ చేస్తున్నారు. ఇప్పటివరకు అటువంటి సీన్లకు నువ్వు దూరంగా ఉన్నావని అనుకుంటున్నామని, అయితే నువ్వు కూడా వారి జాబితాలో చేరిపోయావా? అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు మాత్రం రొమాన్స్ అనేది కూడా పద్ధతిగా ఉంటుంది.. అది మా మహేష్ బాబు చేస్తాడు.. చూసి నేర్చుకోండి అంటూ కౌంటర్లు ఇస్తున్నారు.












Click it and Unblock the Notifications