ఎన్నికల వేళ.. స్టార్ క్యాంపెయినర్‌గా మహేష్ బాబు: యువతకు పిలుపు
Mahesh Babu: దేశంలో సార్వత్రిక ఎన్నికల సందడి మొదలైంది. ఇంకో నాలుగైదు రోజుల్లో షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. ఈ ఎన్నికలను ఎదుర్కొనడానికి అన్ని పార్టీలు సమాయాత్తమౌతోన్నాయి. భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ, కాంగ్రెస్ నాయకత్వాన్ని వహిస్తోన్న ఇండియా కూటమి.. ఈ ఎన్నికల ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.
ఈ ఎన్నికల్లో ఎలాగైనా సరే.. విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది కాంగ్రెస్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీ-ఎన్డీఏ సంకీర్ణ కూటమిని ఓడించడానికి సర్వశక్తులనూ ఒడ్డుతోంది. అందుబాటులో ఉన్న అన్ని వనరులనూ ఉపయోగించుకుంటోంది. దీనికి అనుగుణంగా ఎన్నికల మేనిఫెస్టోకు రూపకల్పన చేసింది.

ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఓ ప్రచారాన్ని చేపట్టింది. ఓటరు జాబితాలో తొలిసారిగా తమ పేరును నమోదు చేసుకున్న వారి కోసం చేపట్టిన క్యాంపెయిన్ ఇది. తొలిసారిగా ఓటు హక్కును పొందిన యువతీ యువకుల కోసం #MeraPehlaVoteDeshKeLiye అనే హ్యాష్ ట్యాగ్‌తో సోషల్ మీడియా వేదికగా దీన్ని ప్రారంభించింది.
తొలిసారిగా ఓటరు జాబితాలో తమ పేరును నమోదు చేసుకున్న వారు తమ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం తన మన్ కీ బాత్ ప్రసంగంలో విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.
దీనికి కొనసాగింపుగా #MeraPehlaVoteDeshKeLiye అనే థీమ్‌తో కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఫిబ్రవరి 27వ తేదీన ఈ క్యాంపెయిన్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఎన్నికల రూపంలో ప్రజాస్వామ్య దేశంలో అతిపెద్ద పండగ రాబోతోందని, ఇందులో అందరూ పాల్గొనాలని కోరారు. యువ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రోత్సహించాలని దేశవ్యాప్తంగా అందరు సెలెబ్రిటీలకు విజ్ఞప్తి చేశారు.
Let's empower the young change-makers of our country to exercise their voting right wisely! #MeraPehlaVoteDeshKeLiye. 🇮🇳@narendramodi @mygovindia https://t.co/c5AdTKvKWT
— Mahesh Babu (@urstrulyMahesh) March 8, 2024
దీనికి మహేష్ బాబు స్పందించారు. #MeraPehlaVoteDeshKeLiye హ్యాష్ ట్యాగ్‌తో ఓ ట్వీట్‌ను తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో కొద్దిసేపటి కిందటే పోస్ట్ చేశారు. యువత తమ ఓటు హక్కును విచక్షణతో వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఓటు హక్కు ఉన్న యువతీ యువకులందరూ ఓటు వేయడం ద్వారా ఈ దేశాన్ని మరింత శక్తిమంతం చేద్దామని పిలుపునిచ్చారు.
ప్రస్తుతం మహేష్ బాబు తన తదుపరి సినిమా కోసం రెడీ అవుతున్నారు. రాజమౌలి దర్శకుడు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‌తో ఓ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కబోతోంది ఈ మూవీ. పాన్ వరల్డ్ లెవెల్‌లో అధిక భాగం సినిమా ఆఫ్రికన్ అడవుల్లో చిత్రీకరణ జరుపుకొంటుందనేది టాక్. గుంటూరు కారం తరువాత మహేష్ నటిస్తోన్న మూవీ ఇదే.
-
టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్.. తెలుగు ఎన్నారై ఇన్ ఫ్లూయెన్సర్ వీడియో వైరల్ ! -
బండ్ల గణేష్ ఇంట పెళ్లి సందడి.. కాబోయే అల్లుడు అతనే ?? -
మధ్యతరగతి మనుషుల ఎమోషనల్ జర్నీ -
పెళ్లయిన నెల రోజులకే రష్మిక గుడ్ న్యూస్..? ముగ్గురం అయ్యామంటూ పోస్ట్ వైరల్.. -
'బైకర్' మూవీ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్.. 2 నెలల్లో 2 హిట్లు నీకే సాధ్యం అన్నా..! -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
తెలుగులో తొలి ఏఐ సినిమా! -
చెప్పుతో పాటు ఆ సింబల్ చూపించిన స్టార్ బ్యూటీ.. కారణం అదే ??? -
రిలీజ్‌కి ముందే ప్రీ రిలీజ్ బిజినెస్‌తో రికార్డ్.. చిన్న సినిమా కాదయ్యో !! -
అల్లు అర్జున్‌కు బాగా ఇష్టమైన మహేష్‌బాబు సినిమా -
అద్దె పోయి వాటా వచ్చింది. సింగిల్ స్క్రీన్స్‌లో మల్టీప్లెక్స్ రూల్స్ -
12 రోజుల్లో రూ.1400 కోట్లు.. చరిత్ర తిరగరాసిన ‘ధురంధర్2’












Click it and Unblock the Notifications