మహేష్‌బాబు ఎన్ని బ్లాక్‌బస్టర్లు వదులుకున్నారో తెలుసా?

ఒక సినిమాకు కథను రాసుకునే సమయలో రచయిత, దర్శకుడు ఫలానా హీరో అయితే బాగుంటాడు అనే ఉద్దేశంతో ఉంటారు. సదరు హీరోను దృష్టిలో పెట్టుకొని స్క్రిప్ట్ ను సిద్ధం చేసుకుంటారు. తీరా ఆ హీరోకు కథ వినిపించిన తర్వాత అతనకు నచ్చకపోవచ్చు.. లేదంటే షెడ్యూల్స్ ఖాళీ లేకపోవడం జరుగుతుంది.

ఒక్కోసారి కథ బాగా నచ్చినప్పటికీ చేయలేనంత బిజీగా ఇతర సినిమాల్లో లీనమై ఉంటారు. అలాగే విన్న కథలన్నీ నచ్చుతాయనే గ్యారంటీ ఉండదు. ఇలా తన దగ్గరకు వచ్చిన అనేక సినిమా కథలను మహేష్ బాబు వివిధ కారణాలవల్ల తిరస్కరించారు. అవన్నీ బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. అవి కూడా ఈ మిల్క్ బాయ్ ఖాతాలో పడివుంటే ఆ రేంజ్ ఎలా ఉండేదో ఊహించడానికి కూడా వీలుకావడంలేదని సినీ విశ్లేషకులు అంటున్నారు.

super star mahesh babu rejected blockbuster movies list details here

పుష్ప
సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సన్సేషనల్ హిట్ అయింది. ప్రస్తుతం సీక్వెల్ సిద్ధమవుతోంది. సుకుమార్ ఈ కథను ముందుగా మమేష్ బాబుకే చెప్పారు. అయితే సినిమాలోని హీరో మేకోవర్, క్యారెక్టరైజేషన్ మహేష్ బాబుకు నచ్చకపోవడంతో దీన్నుంచి తప్పుకున్నారు.

యానిమల్
యానిమల్ సినిమా అతి పెద్ద సంచలనాన్ని నమోదు చేసింది. హీరో పాత్ర తీరు తన వ్యక్తిత్వానికి భిన్నంగా ఉందని భావించిన మహేష్ బాబు సినిమా చేయనని చెప్పడంతో సందీప్ రణబీర్ తో తెరకెక్కించాడు.

ఫిదా
శేఖర్ కమ్ముల ఈ కథను సూపర్ స్టార్ ను దృష్టిలో పెట్టుకొని రాసుకున్నారు. అయితే కొన్ని కారణాలవల్ల ఈ సినిమా వరుణ్ తేజ్ తో తెరకెక్కింది. సాయిపల్లవి హీరోయిన్ గా నటించింది.

ఇడియట్
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ నటించిన ఇడియట్ అప్పట్లో యువతను ఊపేసింది. రవితేజ పాత్ర కోసం మహేష్ బాబును దర్శకుడు సంప్రదించగా ఆయన తిరస్కరించాడు.

గజినీ
సూర్య కథానాయకుడిగా మురుగదాస్ రూపొందించిన గజినీ పెద్ద సంచలనాన్ని సృష్టించింది. ఈ కథ ముందుగా మహేష్ వద్దకే చేరింది. కానీ ఆయన నో చెప్పడంతో సూర్యను ఎంచుకున్నాడు దర్శకుడు.

ఏమాయ చేశావే
గౌతమ్ మీనన్ తెరకెక్కించారు. నాగచైతన్య పాత్ర కోసం మహేష్ ను సంప్రదించారు. ఆ సమయంలో సీరియస్ కథ కోసం ఎదురుచూస్తుండటంతో ప్రేమ కథను తిరస్కరించాడు.

వర్షం
ముందుగా ఈ కథ సూపర్ స్టార్ వద్దకే చేరింది. అయితే దాన్ని వద్దనుకోవడంతో ప్రభాస్ చేసిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలతోపాటు మరికొన్ని కారణాలవల్ల ఇంకొన్ని సినిమాలకు కూడా మహేష్ బాబు నో చెప్పాడు. వాటిల్లో అట్లీ దర్శకత్వంలో వచ్చిన జవాన్, మణిరత్నం పొన్నియన్ సెల్వన్, విక్రమ్ కుమార్ 24 సినిమాలు కూడా ఉన్నాయి. ఈ విషయం తెలియడంతో మహేష్ అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+