దర్శకుడు సుకుమార్‌కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన మహేష్ బాబు
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్న సినిమాకు సిద్ధమవుతున్నారు. దాదాపు మూడు సంవత్సరాలు నిర్మాణం జరుపుకోనుంది. రెండు భాగాలుగా వస్తుందా? ఒకే భాగంగా వస్తుందా? అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కె.ఎల్.నారాయణ రూ.1500 కోట్ల భారీ బడ్జెట్ తో దీన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేస్తున్న పుష్ప సినిమా కూడా మహేష్ బాబే చేయాల్సి ఉంది. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ నటించినంత డీగ్లామర్ గా తాను నటిస్తే అభిమానులు చూడటం కష్టమవుతుందనే ఉద్దేశంతో మహేష్ బాబుదాన్ని తిరస్కరించినట్లు వార్తలు వచ్చాయి.
వంశీ నా కోసం రెండు సంవత్సరాలు ఎదురు చూశాడు
అయితే మహర్షి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ బాబు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా దర్శకుడు పైడిపల్లి వంశీ తనకోసం రెండు సంవత్సరాలు ఎదురుచూశారని, అన్ని సంవత్సరాలు ఎవరూ ఎదురు చూడరన్నారు. ఆ సందర్భంగా పూరీ జగన్నాథ్, సుకుమార్ గురించి ప్రస్తావించలేదని వార్తలు రాకపోవడంతో తర్వాత మీడియా సమావేశం నిర్వహించారు. ఆ ఇద్దరు దర్శకులపై వస్తున్న వార్తలకు మహేష్ బాబు స్పష్టత ఇచ్చారు. వంశీ నాగురించి రెండు సంవత్సరాలు ఎదురు చూశాడని నేను పొగిడానే కానీ సుకుమార్ ను పాయింట్ చేయలేదని చెప్పారు.

రెండు నెలలు కూడా ఆగలేకపోతున్నారు
దీనికి కారణం ఈ రోజుల్లో దర్శకులు కనీసం రెండు నెలలు కూడా ఆగలేకపోతున్నారని, అంత ఓర్పు కూడా ఉండటంలేదని ఓ సందర్భంలో మహేష్ బాబు వ్యాఖ్యానించారు. పుష్ప సినిమా కథ చెప్పిన సమయంలో మహేష్ వేరే సినిమా చేస్తున్నారు. ఇదిపూర్తయిన తర్వాత చేద్దామని సుకుమార్ తో అన్నారు. అయితే అంతవరకు ఆగడం ఇష్టంలేని సుకుమార్ అల్లు అర్జున్ తో దీన్ని తెరకెక్కించారు. అయితే తాను సుకుమార్ ను అలా అన్నట్లుగా వార్తలు వచ్చాయని, అతను నాకు మిత్రుడని, అందులో ఎటువంటి సందేహం అవసరంలేదని, త్వరలోనే ఆయనతో కలిసి పనిచేస్తానని మహేష్ బాబు ఆ మీడియా సమావేశంలో చెప్పారు. పోకిరి సినిమా తనను సూపర్ స్టార్ ను చేసిందని, నేనొక్కడినే సినిమా ఒక కల్ట్ సినిమా అన్నారు. అందుకే ఆ ఇద్దరు దర్శకులకు థాంక్స్ చెబుతున్నానన్నారు. దీన్నివేరేవిధంగా ఎవరూ భావించవద్దని మహేష్ బాబు గతంలో చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో మరోసారి వైరలవుతున్నాయి.












Click it and Unblock the Notifications