66 ఏళ్ల వయసులో కూడా తగ్గేదేలే.. ఇద్దరు బ్యూటీలతో స్టార్ హీరో స్టెప్పులు !!
సూపర్ స్టార్ మోహన్ లాల్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులే. మలయాళ సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా అగ్ర కథానాయకుడిగా వెలుగొందుతున్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా మరోసారి తన ఎనర్జీతో అభిమానులను ఆశ్చర్యపరిచారు. వయసు కేవలం సంఖ్య మాత్రమేనని నిరూపిస్తూ 66 ఏళ్ల వయసులోనూ స్టేజ్‌పై ఉత్సాహంగా డ్యాన్స్ చేసి అందరినీ మెస్మరైజ్ చేశారు. నటనతోనే కాకుండా గాత్రం, స్టేజ్ ప్రెజెన్స్‌తో ఎప్పటికప్పుడు అభిమానులను ఆకట్టుకునే ఆయన.. ఈసారి జర్మనీలో జరిగిన ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమంలో తన ప్రదర్శనతో మెప్పించారు. ప్రస్తుతం ఆయన డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
జర్మనీలో గ్రాండ్ స్టేజ్ షో..
కాగా జర్మనీలో నిర్వహించిన భారతీయ సాంస్కృతిక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మోహన్‌లాల్ పాల్గొన్నారు. స్టేజ్‌పైకి వచ్చిన వెంటనే ఆయనకు ఘన స్వాగతం లభించింది. అనంతరం పలు హిట్ పాటలకు స్టెప్పులు వేస్తూ ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. హీరోయిన్స్ సానియా, శ్వాసికా లతో కలిసి స్టెప్పులేశారు. బాహుబలి చిత్రం లోని 'మనోహరి'.. తమిళ చిత్రం తిరులోని పాపులర్ సాంగ్‌కు కూడా తనదైన స్టైల్‌లో డ్యాన్స్ చేశారు.

ఇక డ్యాన్స్‌తో పాటు మోహన్‌లాల్ తన గాత్రంతో కూడా ప్రేక్షకులను అలరించారు. పలు మలయాళ హిట్ పాటలను ఆలపిస్తూ కార్యక్రమానికి మరింత రంగు చేకూర్చారు. నటుడిగానే కాకుండా మంచి గాయకుడిగా కూడా ఆయనకు ఉన్న గుర్తింపు మరోసారి ఈ కార్యక్రమంలో కనిపించింది. ప్రేక్షకులు కూడా ఆయనతో కలిసి పాటలు పాడుతూ కార్యక్రమాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చారు.
మోహన్‌లాల్ స్టేజ్ ప్రదర్శనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా వేదికల్లో విస్తృతంగా షేర్ అవుతున్నాయి. "ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్", "66 ఏళ్ల వయసులోనూ ఇంత ఎనర్జీ అంటే నిజంగా అద్భుతం", "ఇప్పటికీ యంగ్ హీరోలకు గట్టి పోటీ" అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. పలువురు సినీ అభిమానులు ఆయన ఫిట్‌నెస్, డ్యాన్స్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
🕺🔥@Mohanlal #Mohanlal pic.twitter.com/cdEZTHg86R
— Mohanlal Fans Club (@MohanlalMFC) June 27, 2026
Swasika pic.twitter.com/BqIfABus2R
— BackUp Videos (@BackUpVidio) June 27, 2026












Click it and Unblock the Notifications