కొత్త వ్యాపారంలోకి మహేష్‌బాబు... ఏనుగు కుంభస్థలాన్నే బద్దలు కొడుతున్నాడు
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాకు తగిన విధంగా శిక్షణ తీసుకుంటున్నాడు. గత కొన్ని సినిమాల నుంచి మహేష్ బాబును ఒకే లుక్ లో చూసి విసిగిపోయిన ప్రేక్షకులకు రాజమౌళి కొత్త మహేష్ బాబును చూపించబోతున్నాడు. దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కె.ఎల్.నారాయణ, ఎస్.గోపాల్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిత్రం బడ్జెట్ రూ.1500 కోట్ల వరకు ఉంటోంది. హాలీవుడ్ హీరోయిన్ నవోమీ స్కాట్ కథానాయికగా నటించబోతోంది. సంక్రాంతికి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ సినిమాకు సంబంధించిన వివరాలను రాజమౌళి వెల్లడించనున్నారు. ఫిబ్రవరిలో షూటింగ్ ప్రారంభించబోతున్నారు. ఈలోగా ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.
గ్రీన్ ఎనర్జీవైపు అడుగులు
ఖాళీగా ఉండకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా మహేష్ బాబు ప్రయత్నిస్తున్నారు. రాజమౌళి సినిమా అంటే కనీసం మూడు సంవత్సరాలు కేటాయించాలి. రెండు భాగాలుగా సినిమా వచ్చే అవకాశం ఉంది. ఈలోగా కొన్ని వాణిజ్య ప్రకటనల్లో నటిస్తున్నాడు. తాజాగా కొత్త వ్యాపారంలోకి అడుగుపెడుతున్నాడు. ఇప్పటికే ఏఎంబీ మాల్స్ హైదరాబాద్, బెంగళూరులో ఉన్నాయి. విశాఖలో త్వరలో రాబోతోంది. హైదరాబాద్ లో రెస్టారెంట్ బిజినెస్ ఉంది. నమత్రా శిరోద్కర్ చేసే వ్యాపారాలు కూడా ఉన్నాయి. వీటన్నింటికీ మించి కొత్తగా గ్రీన్ ఎనర్జీవైపు ప్రిన్స్ అడుగులు వేస్తున్నారు. భవిష్యత్తు మొత్తం సోలార్ విద్యుత్తుదే కావడంతో ఆ వ్యాపారం చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

భవిష్యత్తు మొత్తం సౌరశక్తి రంగానిదే
ట్రూజన్ సన్ టెక్ కంపెనీతో కలిసి సౌరశక్తి వ్యాపార రంగంలోకి అడుగుపెడుతున్నారు. దీనికోసం కొన్ని కోట్లరూపాయలను పెట్టుబడిగా పెడుతున్నారు. ట్రూజన్ కంపెనీకి చెందిన వాణిజ్య ప్రకటన కూడా మహేష్ బాబు చేస్తున్నారు. త్వరలోనే ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కేంద్ర ప్రభుత్వం కూడా సోలార్ ఎనర్జీకి అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. దీంతోపాటు ఏపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని సోలార్ విద్యుత్తుతో నింపేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారు. ట్రూజన్ కంపెనీతో కలిసి మహేష్ బాబు ఏ రాష్ట్రంలో ఎంత పెట్టుబడి పెట్టబోతున్నారనే విషయం త్వరలోనే అధికారికంగా వెల్లడి కాబోతోందంటున్నారు.












Click it and Unblock the Notifications