ఆ అగ్ర దర్శకుడిని దగ్గరకు కూడా రానివ్వని మహేష్ బాబు

తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర కథానాయకుడిగా చలామణి అవుతున్న ప్రిన్స్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హీరోలంతా పాన్ ఇండియా సినిమాలు, పాన్ ఇండియా ఇమేజ్ కోసం ప్రయత్నిస్తుంటే మహేష్ బాబు మాత్రం చాలా సింపుల్ గా తెలుగులోనే సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. కానీ పాన్ ఇండియా స్థాయిలో బిజినెస్ జరగడమే కాదు.. పాన్ ఇండియా క్రేజ్ కూడా ఉంది. నిర్మాత, దర్శకులు ప్రిన్స్ తో సినిమాలు చేయడానికి కాల్షీట్ల కోసం ఎదురుచూస్తుంటారు. తాజాగా గుంటూరు కారం సినిమాతో అలరించిన మహేష్ రాజమౌళి సినిమా కోసం సిద్ధమవుతున్నాడు.

సినిమా కథలను పట్టుకొని నిర్మాత, దర్శకులు హీరోల చుట్టూ తిరగడం సాధారణంగానే జరుగుతుంటుంది. నచ్చిన కథను హీరో ఓకే చేస్తాడు. అలాగే దక్షిణాదిలోనే అగ్ర దర్శకుడిగా చెలామణి అవుతున్న శంకర్ కూడా గతంలో మహేష్ బాబుతో సినిమాలు చేయాలని ప్రయత్నించారుకానీ అందుకు మహేష్ బాబు నో చెప్పాడు. త్రీ ఇడియట్స్ చిత్రం హీందీలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దాన్ని స్నేహితుడు పేరుతో తెలుగు, తమిళంలో శంకర్ రీమేక్ చేశారు. ముందుగా ఈ కథను మహేష్ బాబుతో అనుకొని కలవగా బాబు నో చెప్పాడు. దీంతో విజయ్ హీరోగా శంకర్ తెరకెక్కించాడు. తమిళంలో యావరేజ్ గా, తెలుగలో ఫ్లాప్ గా ఈ చిత్రం నిలిచింది.

superstar maheshbabu rejected two times director shankar

తర్వాత తెలుగులో నేరుగా సినిమా చేయాలనే ఉద్దేశంతో శంకర్ మరోసారి ప్రిన్స్ ను కలిశాడు. అప్పుడు కూడా మహేష్ నో చెప్పాడు. శంకర్ దర్శకత్వం అంటే ఇష్టం లేదా? లేదంటే శంకర్ తో సినిమా చేయడం ఇష్టం లేదా? లేదంటే శంకర్ తెచ్చిన కథలు నచ్చడంలేదోకానీ రెండు సందర్భాల్లో బాబు నో చెప్పాడు. ఎప్పుడు అడిగినా తమ అభిమాన హీరో మాత్రం శంకర్ కు నో చెబుతుంటాడని కారణం తనకే తెలియాలని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతుంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+