'కన్నప్ప' సినిమాలో మసాలానా..? ప్రముఖ స్వామీజీ ఆగ్రహం
టాలీవుడ్ హీరో మంచు విష్ణు కలల ప్రాజెక్ట్ 'కన్నప్ప'. జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో దూసుకెళ్తోంది. అయితే తాజాగా ఈ మూవీని అఘోరాలు, సాధువులు, నాగసాధువులు, పీఠాధిపతులతో కలిసి మోహన్‌బాబు సినిమా చూశారు. ఆశ్చర్యంగా వాళ్లు కన్నప్ప మూవీపై కీలక వ్యాఖ్యలు చేశారు.
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ఎట్టకేలకు థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. అయితే తాజాగా ఈ మూవీని అఘోరాలు, సాధువులు, నాగసాధువులు, పీఠాధిపతులతో కలిసి మోహన్‌బాబు సినిమా చూశారు. అనంతరం స్వామీ సదానందగిరి ఈ మూవీ చూసి తన అభిప్రాయం తెలియజేశారు. కొంచెం మసాలా ఉన్నప్పటికీ సినిమా బాగుందన్నారు.
ఆంధ్రలో తిరిగినప్పుడు అప్పుడెప్పుడో లవకుశ, శంకరాభరణం చిత్రాలు చూశాం. మళ్లీ ఇన్నేండ్ల తర్వాత ఒక నిజమైన కథ చూశామని తెలిపారు. భక్త కన్నప్ప, అర్జునుడి గురించి మాకు తెలుసని.. ఇప్పుడున్న టెక్నాలజీని వాడుకుని కన్నప్ప సినిమా తీశారని అన్నారు. ఈ సమాజానికి అవసరమైన కొంచెం మసాలా జోడించినప్పటికీ.. కన్నప్ప నిజమైన భక్తిని దర్శకుడు అద్భుతంగా చూపించారని ప్రశంసించారు.
అంతేకాక సినిమాలోని పాటల వల్లే.. సన్యాసులమైన తమకు కన్నప్ప రెండోసారి చూడాలనిపించిందని తెలిపారు. ఆ రెండు పాటలు లేకుంటే మరోసారి చూసేవాళ్లమని అభిప్రాయం తెలిపారు. ప్రస్తుతం ఆ కామెంట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

ఇక కన్నప్ప మూవీలో విష్ణు ప్రధాన పాత్రలో నటించగా అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ బాబు, మోహన్‌లాల్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్, మధుబాల పలు కీలక పాత్రల్లో నటించారు.












Click it and Unblock the Notifications