బిగ్ బాస్‌లో అతనితో పడుకుంటే కోట్లు ఇస్తామన్నారు
సంచలనాలకు మారు పేరుగా బిగ్ బాస్ రియాలిటీ షో నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే. కొంతమంది సెలబ్రిటీలను ఒక హౌస్‌లో 100 రోజుల పాటు ఉంచి వారితో రకరకాల ఆటలు ఆడిస్తూ..వారిలోని ఎమోషన్స్‌ను బయటకు తీసుకురావడమే ఈ షో యొక్క ముఖ్యం ఉద్దేశం. తొలుత హిందీలో మొదలైన ఈ రియాలిటీ షో తరువాత తమిళ, తెలుగు, కన్నడ, మళయాళ భాషల్లో కూడా ప్రారంభం అయింది.
అయితే ఇది మన దేశ సంప్రదాయాలకు విరుద్దంగా ఉందని చాలామంది ఈ షోపై విమర్శలు చేశారు. మిగిలిన భాషలతో పోలిస్తే...హిందీలో రొమాన్స్ కాస్తా ఎక్కువుగానే కనిపిస్తుంటుంది. ఈ షోకు వెళ్లి ప్రేమికులకు మారిన వారు కొందరైతే..అక్కడి వెళ్లి విడిపోయిన వారు మరికొందరు. ఇక బిగ్‌బాస్ షోలో ప్రెగ్నెన్సీ టెస్టులు కూడా నిర్వహించారనే వార్త అప్పట్లో పెను సంచలనమే సృష్టించింది.

బిగ్‌బాస్ హౌస్‌లో శృంగారంపై అనేక పుకార్లు ప్రచారంలో ఉన్నాయి. 100 రోజుల పాటు తమ ఫీలింగ్స్‌ను ఎలా కంట్రోల్ చేసుకుంటారనే నెటిజన్ల ప్రశ్న. ఇదిలా ఉంటే తాజాగా ఈ షోపై హీరోయిన్ తనుశ్రీ దత్తా సంచలన కామెంట్స్ చేశారు.
మీటూ ఉద్యమంతో తీవ్ర వివాదాస్పదంగా మారిన తనుశ్రీ దత్తా, తాజాగా ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్‌పై చేసిన కామెంట్లు పెను దుమారం రేపుతున్నాయి. గత పదకొండేళ్లుగా తనకు బిగ్ బాస్ నుంచి ఆఫర్లు వస్తున్నాయని, ఏకంగా రూ.1.65 కోట్ల భారీ పారితోషికాన్ని కూడా ఇచ్చేందుకు సిద్ధపడ్డారని ఆమె వెల్లడించారు. కానీ, ఆ షోలో పాల్గొనేంత చీప్ మెంటాలిటీ తనది కాదని ఆమె తేల్చి చెప్పారు.
బిగ్ బాస్‌పై తనుశ్రీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆ షోలో ఆడవారు, మగవారు ఒకే మంచంపై కలిసి పడుకోవాల్సి ఉంటుందని, అలా ఒకే బెడ్‌పై పడుకునేంత చీప్ తను కాదని ఆమె స్పష్టం చేశారు. "నా వ్యక్తిగత స్వేచ్ఛ కోసం సొంత కుటుంబంతో కూడా కలిసి ఉండని నేను, పరాయి వ్యక్తులతో ఒకే బెడ్‌పై గొడవలు పడుతూ ఎలా ఉంటాను?" అని ఆమె ప్రశ్నించారు. ఈ రియాలిటీ షోలో ఒకరినొకరు మోసం చేసుకోవడం, ఎప్పుడూ గొడవలు పడుతూ ఉండటం తనకు నచ్చదని, అందుకే బిగ్ బాస్ ఆఫర్‌ను తిరస్కరించానని తనుశ్రీ చెప్పుకొచ్చారు.
తనుశ్రీ దత్తా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. కొందరు ఆమె అభిప్రాయాన్ని సమర్థిస్తుండగా, మరికొందరు ఆమె వ్యాఖ్యలు బిగ్‌బాస్ షోను కించపరిచేలా ఉన్నాయని విమర్శిస్తున్నారు. ఈ వివాదాస్పద కామెంట్స్‌తో మరోసారి తనుశ్రీ దత్తా హెడ్‌లైన్స్‌లో నిలిచారు.












Click it and Unblock the Notifications