అవసరమా అధ్యక్షా.. పాన్ ఇండియా మూవీగా తెలంగాణ మంత్రి బయోపిక్ !!
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి పుణ్యమా అని ఇండియన్ సినిమా రేంజ్ మారిపోయింది. రీజనల్ స్థాయి నుంచి నేషనల్ ఇంటర్నేషనల్ రేంజ్ లో మన సినిమాలు అదరగొడుతున్నాయి. దీంతో ఇతర భాషల్లో సైతం పాన్ ఇండియా చిత్రాలు వస్తున్నాయి. అంతకు ముందు ఒక భాషలో తెరకెక్కిన సినిమాని మరో భాషలోకి అనువాదం చేయడం జరిగింది కానీ ఇంత భారీ స్థాయిలో రిలీజ్ లు అయితే జరగలేదు. ఈ క్రమంలోనే సినిమా కంటెంట్ ఏదైనా కానీ పాన్ ఇండియా రిలీజుల కోసం ప్లాన్ చేసుకుంటున్నారు.
ఒక్క భాష నుంచి ఒక్కో నటుడిని తీసుకోవడం.. పలు భాషల్లో ప్రమోషన్స్ చేయడం.. మొత్తానికి 5,6 భాషల్లో మూవీ రిలీజ్ చేయడం జరుగుతూ వస్తుంది. ఈ ప్లాన్ వేసిన దాదాపు 100 లో 90 చిత్రాలు ఫ్లాప్ గానే నిలుస్తున్నాయి. కంటెంట్ ఉన్న రీజినల్ సినిమాలు సైతం మిగతా భాషల్లో అదరగొడుతున్నాయి. కానీ ఇప్పుడు కొత్తగా తెలంగాణలోని మంత్రి మీద అభిమానంతో ఆయన జీవితంపై బయోపిక్ తెరకెక్కిస్తున్నారు. అక్కడి వరకు బాగానే ఉన్న ఆ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించాలని భావిస్తుండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ స్టోరీ ఏంటో తెలుసుకుందాం...

మంత్రి పొంగులేటి బయోపిక్..
తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు సుపరిచితులే. కాగా ఇప్పుడు ఆయన జీవితం ఆధారంగా ఒక బయోపిక్ రానుంది. ఈ చిత్రానికి 'శ్రీనన్న అందరివాడు' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాలో పొంగులేటి పాత్రను సీనియర్ నటుడు సుమన్ పోషించనుండగా.. నిర్మాతగా, దర్శకుడిగా బయ్యా వెంకట నర్సింహ రాజ్ వ్యవహరిస్తున్నారు. షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని సమాచారం.
పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్..
అయితే ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారట. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలతో పాటు అస్సామీలో కూడా రిలీజ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందని సినీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయింది. పోస్టర్‌లో ఒకవైపు హీరో సుమన్ గెటప్‌లో కనిపించగా, మరోవైపు నిజజీవిత పొంగులేటి ఫొటో ఆకట్టుకుంటోంది.
పొంగులేటి రాజకీయ ప్రయాణం..
2014లో ఖమ్మం నుండి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా లోక్‌సభకు గెలిచారు.
అనంతరం టీఆర్ఎస్ (ప్రస్తుతం బీఆర్ఎస్)లో చేరారు.
2018లో టీఆర్ఎస్ తరపున లింగాల కమలరాజ్‌కు మద్దతు ఇచ్చారు.
2023లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాల ఆరోపణలతో బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయ్యారు.
జూలై 2023లో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
అదే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుండి భారీ మెజారిటీతో గెలిచారు.
ప్రస్తుతం తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు.

బయోపిక్స్ ట్రెండ్..
ఇటీవలి కాలంలో సినీ పరిశ్రమలో రాజకీయ, సినీ ప్రముఖుల జీవితాల ఆధారంగా బయోపిక్స్ ట్రెండ్‌గా మారాయి. ఎన్టీఆర్ బయోపిక్ (కథానాయకుడు, మహానాయకుడు).. నందమూరి బాలకృష్ణ స్వయంగా నటించిన ఈ రెండు భాగాల సినిమాలు ఎన్టీఆర్ రాజకీయ, సినీ ప్రయాణాన్ని చూపించాయి. అయితే ఈ మూవీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది. జయలలిత బయోపిక్ "తలైవి" లో కంగనా రనౌత్ నటించింది.
అలానే మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితం ఆధారంగా యాత్ర చిత్రాన్ని రిలీజ్ చేశారు. రెండు పార్టులుగా వచ్చిన ఈ మూవీ మంచి సక్సెస్ అందుకుంది. అయితే సీఎం స్థాయి వ్యక్తుల బయోపిక్ లు చూశాం కానీ మొదటి సారి మంత్రి స్థాయిలో ఉన్న పొంగులేటి బయోపిక్ రావడం హాట్ టాపిక్ అవుతోంది. ప్రజాదరణ ఉన్న నాయకుడిగా ఆయనకు మంచి పేరు ఉన్నప్పటికీ.. పాన్ ఇండియా రిలీజ్ అవసరమా అని డిస్కషన్ నడుస్తోంది.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications