ప్రభాస్-రష్మిక-సమంత వార్తలు ఫేకా? నిజమా?
తెలుగు సినీ పరిశ్రమను కొన్నాళ్ల క్రితం నుంచి ఫేక్ వార్తలు షేక్ చేస్తున్నాయి. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ తరహా వార్తలు ఎక్కువయ్యాయి. వాటిల్లో నిజమెంతో? అబద్ధమెంతో తెలియడంలేదు. వార్తలు మాత్రం పుంఖాను పుంఖాలుగా వస్తూనే ఉంటాయి. రోజుకు పదివార్తలైనా ఫేక్ వార్తలు వస్తుంటాయి. అటువంటి వాటిల్లో టాప్-5 ఫేక్ వార్తలు ఉన్నాయి. వాటిల్లో నిజమెంతో? అబద్ధమెంతో తెలియక అభిమానులు కూడా నానా హైరానా పడ్డారు. ఆ వార్తలను ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఆదిపురుష్ సినిమా చేసే సమయంలోనే ప్రభాస్ తన తోటి నటి కృతి సనన్ తో ప్రేమలో పడ్డారని, బీచ్ లో ఎంగేజ్ మెంట్ జరిగిపోయిందని, రిసార్టులో ఉంగరాలు మార్చుకున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే అటువంటిదేమీ లేదంటూ కృతి సనన్ తర్వాత ఆ వార్తపై స్పష్టతనిచ్చింది.

సమంత మయోసైటిస్ తో బాధపడుతూ ఏడాదిపాటు సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. అయితే అదే సమయంలో నిర్మాతల నుంచి తీసుకున్న అడ్వాన్స్ కూడా వెనక్కి తిరిగిచ్చేసింది. చికిత్స కోసం ఒక హీరో నుంచి రూ.5 కోట్లు అప్పుగా తీసుకుందని, అందుకు కారణం ఆర్థికంగా సమస్యలు ఎదురుకావడమేనని వార్తలు వచ్చాయి. అయితే సమంత ఆ వార్తను ఖండించింది.
ప్రియమణి తన రెండో ఇన్నింగ్స్ లో దూసుకుపోతోంది. వివాహానికి ముందే ఒక స్టార్ హీరోను విపరీతంగా ప్రేమించిందని, అతనికి పెళ్లయి భార్య, పిల్లలు ఉన్నప్పటికీ రెండో వివాహం చేసుకోవాలని ఎంతో ప్రయత్నించినప్పటికీ కుదరలేదని వార్తలు వచ్చాయి. ఆ హీరో భార్య రంగంలోకి దిగడంతో ప్రియమణి సైలెంటైంది. తర్వాత ముస్తఫాను ప్రేమించి పెళ్లిచేసుకుంది.
రష్మిక సినిమాకు సంబంధించిన పూర్తి పారితోషికాన్ని తీసుకున్న తర్వాత ఆ సినిమా చేస్తుందంటూ వార్తలు వచ్చాయి. తన ఖాతాలో పూర్తి రెమ్యునరేషన్ పడితేనే సినిమా చేస్తుందంటూ వచ్చిన వార్తలను రష్మిక ఖండించింది.
సందీప్ రెడ్డి వంగా యానిమల్ సినిమా కథ ముందుగా మహేష్ బాబుకు వినిపించారని, తను తిరస్కరిస్తేనే రణబీర్ కపూర్ దగ్గరకు చేరిందని వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే సందీప్ దీనిపై స్పష్టతనిచ్చాడు. మహేష్ బాబుకు వినిపించిన కథ వేరని, రణబీర్ కపూర్ కు చెప్పిన కథ వేరని చెప్పారు.












Click it and Unblock the Notifications