"ఉస్తాద్ భగత్ సింగ్" కి తప్పని తిప్పలు.. షూటింగ్ అడ్డుకున్న కార్మిక సంఘాలు !
తెలుగు చిత్ర పరిశ్రమలో సమ్మె సైరన్ మోగింది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (Telugu Film Industry Employees Federation) నేటి నుంచి.. టాలీవుడ్‌లో అన్ని సినిమా షూటింగ్‌లు, వెబ్ సిరీస్‌ల పనులు బంద్ కు పిలుపునిచ్చింది. రోజు వారి వేతనాలు 30 శాతం వరకు పెంచాలన్న డిమాండ్‌కు స్పందన లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది. కాగా ఇప్పటికే మీడియం, చిన్న సినిమాల షూటింగ్స్ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కానీ బడా నిర్మాణసంస్థలు మాత్రం బంద్ వ్యవహారం పట్టించుకోకుండా షూటింగ్స్ కొనసాగిస్తున్నాయి.
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం "ఉస్తాద్ భగత్ సింగ్". ఇన్నాళ్లు రాజకీయాల కారణంగా సినిమా షూటింగ్ లను పక్కన పెట్టిన ఆయన ఇప్పుడు వరుసగా కమిట్ అయిన సినిమాలను ఫినిష్ చేసేస్తున్నారు. ఇప్పటికే హరిహర వీరమల్లు చిత్రం రిలీజ్ అయ్యింది. అలానే సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న "ఓజీ" మూవీలో కూడా తన పార్ట్ షూటింగ్ ని ఫినిష్ చేసేశారు. దాంతో ఈ సినిమాని కూడా త్వరగా పూర్తి చేసే పనిలో ఉన్నారు.

హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో పవన్ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్న ఈ మూవీని.. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ మూవీకి అనుకోని తిప్పలు వచ్చి పడ్డాయి. ఇన్నాళ్లు పవన్ కారణంగా సినిమాకి బ్రేక్ పడితే.. ఇప్పుడు కార్మిక సంఘాలు షూటింగ్ ని అడ్డుకోవడం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
షూటింగ్ అడ్డుకున్న కార్మిక సంఘాలు..
హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. పవన్ పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఓ వైపు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ బంద్ కి పిలుపునిచ్చినప్పటికీ.. సీనియర్ నటీనటుల కాంబినేషన్ లో సీన్స్ ఉండడంతో షూటింగ్ ఆపితే ఎక్కువ నష్టం వస్తుందని భావించి కొనసాగిస్తున్నారు. అందుకోసం తెలుగు సినిమా కార్మికులు బంద్ లో ఉన్న కారణంగా ముంబై నుంచి కార్మికులను తెప్పించి మరి షూటింగ్ నిర్వహిస్తోంది మైత్రీ సంస్థ.
అయితే ఈ విషయం తెలుసుకున్న తెలుగు కార్మిక సంఘం ప్రతినిధులు షూటింగ్ ను అడ్డుకునేందుకు యత్నించారు. దాంతో అక్కడ మూవీ యూనిట్ కి - కార్మికులకు మధ్య వాదనలు చెలరేగాయని అంటున్నారు. తెలుగు కార్మికులు ఒక వైపు బంద్ చేస్తుంటే.. ముంబై నుంచి వర్కర్స్ ను ఎలా తీసుకువస్తారని ప్రశ్నిస్తున్నారు. మన కార్మికులు కష్టం హీరో పవన్ కళ్యాణ్ కి తెలియదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.
#UstaadBhagatSingh completes shooting for climax ❤️🔥
— Mythri Movie Makers (@MythriOfficial) July 29, 2025
An electrifying climax high on emotions and action was wrapped up under the supervision of #NabaKanta master.
Despite his cabinet meetings & responsibilities as the Deputy CM of Andhra Pradesh and taking part in Hari Hara… pic.twitter.com/mRVXakUXlk












Click it and Unblock the Notifications