అందరి ముందు గీతా మాధురి బుగ్గ గిల్లిన తమన్

ప్రస్తుతం OTT ప్లాట్‌ఫామ్‌లలో షోల సందడి నడుస్తోంది. ఆహాలో ప్రారంభమైన తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 కూడా మంచి హైప్‌తో మొదలైంది. అయితే, మొదటి మూడు సీజన్లలా కాకుండా ఈ సీజన్ వివాదాలతో మొదలైంది. తాజాగా ఈ షోలో జరిగిన ఒక సంఘటన ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది, సోషల్ మీడియాలో విమర్శలకు దారితీసింది.

ఈ షోలో పాల్గొన్న శ్రీజ అనే కంటెస్టెంట్ తాను తమన్‌కు వీరాభిమానినని చెబుతూనే, స్టేజ్‌పైకి వెళ్లి ఆయన చెంపను గిల్లింది. దీనికి సరదాగా స్పందించిన తమన్, పక్కనే ఉన్న గీతా మాధురి, కార్తీక్ చెంపలను కూడా గిల్లాడు. ఒక సింగింగ్ షోలో ఇలాంటి గిల్లడం లాంటి చిలిపి చేష్టలు ఏమాత్రం సముచితం కాదని నెటిజన్లు తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Indian Idol 4 Controversy Judges Actions Spark Outrage on Social Media

నిజానికి, సింగింగ్ షోలో జడ్జిలు పాటలు పాడే విధానం, గానంలో మెళకువలు, భవిష్యత్తులో మంచి గాయకులుగా ఎదగాలంటే ఎలాంటి కష్టాలు పడాలి వంటి విషయాలపై సలహాలు, సూచనలు ఇవ్వాలి. కానీ, ఈ షోలో అలాంటి విషయాలను పక్కన పెట్టి, కేవలం కామెడీ కోసం ఇలాంటి చేష్టలు చేయించడంపై ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

చాలామంది ప్రేక్షకులు ఈ వ్యవహారం వెనుక డైరెక్టర్ స్క్రిప్ట్ ఉందని నమ్ముతున్నారు. టీఆర్పీ రేటింగ్స్ కోసం ఇలాంటి చీప్ ట్రిక్స్ను ప్లే చేయడం వల్ల షో యొక్క విలువ తగ్గుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. సింగింగ్ షో అంటే పాటలకే ప్రాధాన్యత ఇవ్వాలి గానీ, ఇలాంటి కామెడీలకు కాదు అని వారు గట్టిగా చెబుతున్నారు. ఈ సంఘటన వల్ల షో పరువు పోవడమే కాకుండా, జడ్జిల పట్ల కూడా నెగెటివ్ ఇంప్రెషన్ ఏర్పడే ప్రమాదం ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+