టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్.. తెలుగు ఎన్నారై ఇన్ ఫ్లూయెన్సర్ వీడియో వైరల్ !

చలనచిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అంశం తరచూ చర్చకు వస్తూనే ఉంది. సినీ వర్గాలు మాత్రమే కాకుండా సాధారణ ప్రజల్లో కూడా దీనిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. గతంలో అనేక సినీ పరిశ్రమల్లో నటీమణులు చేసిన ఆరోపణలతో పెద్ద వివాదాలు చెలరేగిన విషయం తెలిసిందే. తెలుగు చిత్రసీమ కూడా ఈ సమస్యకు మినహాయింపు కాకపోవడం ఆందోళన కలిగించే విషయం. తాజాగా ఒక తెలుగు ఇన్‌ఫ్లుయెన్సర్ చేసిన కామెంట్స్ తో ఈ ఆరోపణల అంశం మరోసారి వార్తల్లోకి వచ్చింది.

NRI యువతి వీడియో వైరల్...

తెలుగు యువతి, ఇన్‌స్టాగ్రామ్‌లో 'పీకు నెమలి' పేరుతో ప్రసిద్ధి చెందిన ఇన్‌ఫ్లుయెన్సర్.. న్యూయార్క్‌ లో ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్ గా ఒక వీడియో విడుదల చేసి సంచలనం సృష్టించింది. ఆ వీడియోలో ఆమె టాలీవుడ్‌లో అవకాశాల కోసం ప్రయత్నించిన సమయంలో ఎదురైన చేదు అనుభవాన్ని వివరించింది. ఈ వీడియో తక్కువ సమయంలోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, విస్తృత చర్చకు దారి తీసింది.

telugu-nri-influencer-from-newyork-made-sensational-comments-on-casting-couch-in-tollywood-goes-vira

ఆమె చెప్పిన వివరాల ప్రకారం.. పరిచయస్తుల ద్వారా ఒక సహాయ దర్శకుడిని సంప్రదించి తన పోర్ట్‌ఫోలియో పంపింది. ప్రారంభంలో సాధారణంగా జరిగిన సంభాషణ తర్వాత, ఆ వ్యక్తి తన అసలు ఉద్దేశాన్ని బయటపెట్టాడని ఆమె ఆరోపించింది. భారత్‌లోని ఒక రిసార్ట్‌కు రావాలని, అక్కడ ఒక ప్రముఖ నిర్మాతను కలవాలని సూచిస్తూ, దాని వెనుక అనైతిక ఉద్దేశాలు ఉన్నాయని ఆమె వెల్లడించింది. ఈ ఘటన ఆమెకు తీవ్ర షాక్‌కు గురిచేసిందని, వెంటనే ఆ వ్యక్తిని బ్లాక్ చేసినట్లు తెలిపింది. ఈ అనుభవం తనను మానసికంగా కలచివేసిందని, ఇలాంటి పరిస్థితులు చాలా మంది ప్రతిభావంతులైన అమ్మాయిలను వెనక్కి తగ్గేలా చేస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

ఈ తరహా ఘటనలు సినీ పరిశ్రమ ప్రతిష్టపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా కొత్తగా ఇండస్ట్రీలోకి రావాలనుకునే యువతలో భయాందోళనలు పెరుగుతున్నాయి. టాలెంట్ ఉన్నవారు కూడా ఇలాంటి పరిస్థితుల కారణంగా అవకాశాలను వదులుకోవాల్సి వస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వీడియోపై ప్రముఖ టాలీవుడ్ కళాకారిణి, యాంకర్ Jhansi వెంటనే స్పందించారు. ఆమె టాలీవుడ్ మహిళల సహాయక బృందంలో కీలక సభ్యురాలిగా ఉన్నారు. అలాగే లైంగిక వేధింపుల నివారణ కమిటీలో కూడా ఆమె భాగస్వామిగా ఉన్నారు.

ఝాన్సీ నేరుగా ఆ ఇన్‌ఫ్లుయెన్సర్‌ను సంప్రదించి, ఆమె అనుభవాన్ని సీరియస్‌గా తీసుకుంటామని హామీ ఇచ్చారు. అవసరమైన సహాయం అందిస్తామని, ఈ అంశంపై సమగ్రంగా విచారణ జరుపుతామని తెలిపారు. టాలీవుడ్‌లో మహిళల భద్రత కోసం ఏర్పాటైన కమిటీలు ఇలాంటి కేసులను పరిగణలోకి తీసుకుని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు సూచిస్తున్నారు. ఆరోపణలు చేసిన వ్యక్తుల వివరాలు బయటకు వస్తే, సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఆరోపణల వెనుక ఉన్న వ్యక్తుల పేర్లు బహిరంగం కాలేదు. ఈ అంశంపై అధికారికంగా ఎలాంటి ఫిర్యాదు నమోదవుతుందా లేదా అనేది కీలకంగా మారింది.

సోషల్ మీడియా స్పందన... మద్దతు vs సందేహాలు

పీకు నెమలి వీడియోకు వందలాది కామెంట్లు, రీపోస్టులు రావడం గమనార్హం. చాలా మంది ఆమెకు మద్దతు తెలుపుతూ ధైర్యంగా ముందుకు వచ్చిందని అభినందిస్తున్నారు. మరోవైపు, కొందరు పూర్తి వివరాలు వెలుగులోకి రావాలని, ఆధారాలతో నిజానిజాలు బయటపడాలని అభిప్రాయపడుతున్నారు. ఇదే అంశంపై గతంలో కూడా టాలీవుడ్‌లో పలు వివాదాలు చోటుచేసుకున్నాయి. ఈ తరహా ఘటనలను అరికట్టేందుకు ఇండస్ట్రీలో మరింత పారదర్శకత అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+