థాయ్‌లాండ్: రకుల్ బ్యాచ్‌లర్ పార్టీలో మెరిసిన టాలీవుడ్ తారలు..
టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. రకుల్ ఎంతో కాలంగా బాలీవుడ్ నటుడు జాకీ భగ్నాతో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. వీరిద్దరూ తమ రిలేషన్ షిప్ గురించి సోషలస్‌మీడియాలో అధికారికంగా కూడా ప్రకటించారు. ఇక, వీరిద్దరూ ఫిబ్రవరి 21న ఒక్కటి కాబోతున్నారు. గోవాలో వీరి వివాహాం జరగబోతుంది. ఈ క్రమంలో ఈ అమ్మడు థాయ్‌లాండ్‌లో బ్యాచ్‌లర్ పార్టీని ఇచ్చింది. ఈ పార్టీకి టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు.
ప్రస్తుతం తెలుగులో సినిమా అవకాశాలు తగ్గినా సోషల్‌మీడియాలో మాత్రం ఆమెకు అభిమానుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఇక, ఈ అమ్మడు గతకొద్ది కాలంగా బాలీవుడ్‌లో సినిమాలు చేస్తూ ఫుల్ బిజిగా మారిపోయింది. బాలీవుడ్‌లో అజయ్ దేవగణ్ వంటి టాప్ హీరోలతో సినిమాలు చేసింది. ఇక, తెలుగులో ఈ భామకి అవకాశాలు తగ్గిపోయాయి. ఈ క్రమంలో బాలీవుడ్‌లో తన జోరు పెంచుకుంది. రెండేళ్ల క్రితమే బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్నట్లు రకుల్ ప్రీత్ సింగ్ అధికారికంగా ప్రకటించేసింది. దీంతో అప్పటి నుంచి వీరి పెళ్లి ఎప్పుడెప్పుడా అని ఆమె అభిమానులు తెగ వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె పెళ్లి గురించి వార్తలు వచ్చేస్తున్నాయి.

ఈ నెల 21న గోవాలో రకుల్ వివాహం : త్వరలోనే ఈ భామ ప్రియుడితో పెళ్లి పీటలు ఎక్కబోతుంది. ఫిబ్రవరి 19 నుంచి 21 వరకు గోవాలో వీరి పెళ్లి వేడుకలు రెండు రోజులు జరగనున్నాయి. అనంతరం ముంబైలో రిసెప్షన్ కూడా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ రిసెప్షన్ వేడుకలో పలువురు బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రెటీలు సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. సిక్కు మత సంప్రదాయంలో ఓ వేడుకైన అఖండ పథ్ ఈనెల 3న జరిగింది. దానికి సంబందించిన ఫొటోను రకుల్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ నెల 21న వీరి వివాహం గోవాలో జరగబోతోంది. ఈ నేపథ్యంలో రకుల్ తమ స్నేహితులకు థాయ్‌లాండ్‌లో బ్యాచిలర్ పార్టీ ఇచ్చింది. ఈ పార్టీకి టాలీవుడ్ నుంచి మంచు లక్ష్మి, ప్రగ్యా జైస్వాల్ హాజరై, సందడి చేశారు.












Click it and Unblock the Notifications