ప్రతిభకు పేదరికం అడ్డుకాదు.. RSI ఇండియా 2026తో అదానీ కొత్త చరిత్ర..!!
భారతదేశ సాంకేతిక,శాస్త్ర రంగాల భవిష్యత్తును సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు నవతరం యువ కిరణాలు సిద్ధమయ్యారు. బెంగళూరులోని అత్యంత ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) ప్రాంగణంలో ఆరు వారాల పాటు సాగిన 'రిసెర్చ్ సైన్స్ ఇనిషియేటివ్' (RSI)-ఇండియా 2026 కార్యక్రమం భావోద్వేగాల మధ్య ఘనంగా ముగిసింది. దేశవ్యాప్తంగా ఎంపికైన 32 మంది అత్యంత ప్రతిభావంతులైన హైస్కూల్ విద్యార్థులు తమ కలలను నిజం చేసుకునేందుకు ఈ వేదిక ఒక అద్భుతమైన మార్గాన్ని చూపింది.
అమెరికాలోని ప్రసిద్ధ మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) నమూనా ఆధారంగా రూపొందించిన ఈ ఆరు వారాల ఇంటెన్సివ్ రీసెర్చ్ కార్యక్రమం విద్యార్థులకు పూర్తిగా ఉచితంగా అందించబడింది. అదానీ గ్రూప్, అమెరికాకు చెందిన 'సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్' (CEE) సంయుక్త భాగస్వామ్యంతో ఈ శిక్షణను విజయవంతంగా నిర్వహించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, దేశవ్యాప్తంగా ఉన్న అర్హులైన పేద విద్యార్థులకు సైతం ప్రపంచ స్థాయి ల్యాబొరేటరీలలో శాస్త్రీయ ఆవిష్కరణలు చేసే అరుదైన అవకాశం దీనివల్ల లభించింది.

అదానీ వల్లే సాధ్యమైంది
మన దేశంలో చాలా మంది విద్యార్థులు హైస్కూల్ దశలోనే తమ కెరీర్ నిర్ణయాలు తీసుకుంటారు. సాధారణంగా మెడిసిన్ లేదా ఇంజినీరింగ్ అనే రొటీన్ చట్రంలోనే వారు ఉండిపోతుంటారు. అయితే, దేశానికి స్వచ్ఛమైన సైన్స్ పరిశోధకులు ఎంతో అవసరమని RSI-ఇండియా ఫ్యాకల్టీ కన్వీనర్ ప్రొఫెసర్ దీపక్ సైనీ ఆశాభావం వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమమే విద్యార్థులకు సైన్స్ పట్ల అమితమైన ఆసక్తిని పెంపొందిస్తూ, వారి చేత సరికొత్త ఆవిష్కరణల వైపు అడుగులు వేయించిందని ఆయన ఉద్ఘాటించారు. అదానీ గ్రూప్ అందించిన అద్భుతమైన తోడ్పాటు వల్లే ఈ లక్ష్యం సాకారమైందని కొనియాడారు.
ఈ శిక్షణలో పాల్గొన్న విద్యార్థులు తమ అనుభవాలను తలుచుకుంటూ ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. శివ్ మాండ్లిక్ అనే విద్యార్థి మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది నాలాంటి విద్యార్థులకు ఇంతటి కఠినమైన, అత్యున్నత స్థాయి పరిశోధన కోర్సును ఉచితంగా అందుబాటులోకి తెచ్చినందుకు అదానీ గ్రూప్‌నకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆర్థిక పరిమితులు తమ శాస్త్రీయ తృష్ణకు అడ్డుకాకుండా చేయడం అపురూపమైన అవకాశమని తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
నవతరం శాస్త్రవేత్తల ప్రతిజ్ఞ
మరో విద్యార్థి ప్రద్యున్ ఈ కార్యక్రమాన్ని తన జీవితంలోనే అత్యంత కఠినమైన, అలాగే ఎంతో మధురమైన ప్రయాణంగా వర్ణించాడు. స్వచ్ఛమైన సైన్స్ పరిశోధనల వైపు భారతీయ యువతను నడిపించేందుకు ఇలాంటి గొప్ప వేదికలు మన దేశంలో రాబోయే పదేళ్ల పాటు నిరంతరం కొనసాగాలని, తద్వారా భారత్ నుండి అద్భుతమైన ఆవిష్కరణలు సాధ్యమవుతాయని అభిప్రాయపడ్డాడు. చదువుతో పాటు సమాన అభిరుచులు ఉన్న స్నేహితులను కలుసుకోవడం, సరికొత్త శాస్త్రీయ ఆలోచనలను ఒకరితో ఒకరు పంచుకోవడం అపూర్వమైన అనుభవమని తనీష్క్ భావోద్వేగంతో తెలిపాడు.
ఈ ముగింపు వేడుక కేవలం సర్టిఫికెట్ల పంపిణీతోనో, కొన్ని ప్రసంగాలతోనో ముగిసిపోలేదు. ఈ 32 మంది బాల శాస్త్రవేత్తలు సమర్పించిన పరిశోధనా ప్రాజెక్టులు భారతీయ సైన్స్ రంగంలో సరికొత్త శకానికి పునాదిగా నిలిచాయి. ఆర్థిక అడ్డంకులను పటాపంచలు చేస్తూ, భావి శాస్త్రవేత్తల ప్రతిభను వెలికితీసిన ఈ మహత్తర ప్రయాణమే రేపటి భారతదేశ భవిష్యత్తును వెలిగించబోతోంది.












Click it and Unblock the Notifications