గ్రీన్ టీ రెగ్యులర్ గా తాగుతున్నారా - ఇది తెలుసుకోవాల్సిందే..!!

గ్రీన్ టీ వినియోగం పెరిగింది. గ్రీన్ టీ అనేక రకాల ప్రయోజనాలు అందిస్తోంది. ఆరోగ్య పరంగానూ మేలు చేస్తుంది. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటం గ్రీన్ టీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. చాలామంది ఉదయం నిద్రలేచాక గ్రీన్ టీతోనే రోజును ప్రారంభిస్తారు.అయితే, గ్రీన్‌ టీ విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పని సరి. లేదంటే సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తు న్నారు. కొన్ని ఆరోగ్య పరమైన సమస్య లు ఎదుర్కొంటున్న వారు సైతం గ్రీన్ టీ కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. గ్రీన్ టీ వినియోగించే సమయాల పైనా స్పష్టత ఇస్తున్నారు.

గ్రీన్ టీ పరిమితంగా.. నిర్దేశించిన సమయాల్లో తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బరువు తగ్గే ప్రయత్నాల్లో ఉన్నవారు, డీటాక్స్ కోసం ప్రయత్నించే వారు ఎక్కువగా తాగుతారు. చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచు తుంది. చెడు కొలె స్ట్రాల్‌ను క్లీయర్‌ చేస్తుంది. గ్రీన్ టీలో ఫ్రీ రాడికల్స్‌ను నివారించే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మెటబాలిజంను పెంచి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. శరీరాన్ని డీటాక్స్ చేసి శక్తిని ఇస్తుంది. మెదడును ఉత్తేజ పరుస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇవన్నీ మేలు చేసేవి కాగా, ఉదయం వేళ ఖాళీ కడుపున తీసుకునే వారికి సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గ్రీన్ టీలో టానిన్లు ఉంటాయి. ఇవి కడుపు ఆమ్లతను పెంచుతాయి. మీకు వికారం లేదా ఉబ్బరం కలిగిస్తాయి. గ్రీన్‌ టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అయితే, ఉదయం ఖాళీ కడుపున తీసుకోవడం వల్ల మన కడుపులో యాసిడ్‌ స్థాయిలు పెరిగి..అజీర్తి చేసే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

 ఉపేక్షించవద్దు, సోషల్ మీడియా పోస్టులపై కేబినెట్ కీలక ఆదేశాలు..!!
ఉపేక్షించవద్దు, సోషల్ మీడియా పోస్టులపై కేబినెట్ కీలక ఆదేశాలు..!!
green-tea-can-help-stimulate-digestion-support-fat-oxidation-and-reduce-bloating

నిపుణుల సూచనలు

అదే విధంగా ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగడం వల్ల జీర్ణక్రియ మందగించే అవకాశం ఉంది. ఇది గ్యాస్ట్రిక్, యాసిడిటీ వంటి సమస్యలు రావొచ్చు. ఉదయం ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగితే కడుపులో యాసిడ్ స్థాయి పెరిగి గ్యాస్, మలబద్ధకం, మైగ్రేన్ వంటి సమస్యలు రావచ్చని వైద్యులు చెబుతున్నారు. ఖాళీ కడుపున కాకుండా.. భోజనం తర్వాత లేదా టిఫిన్‌తో పాటు గ్రీన్ టీ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. ఇదే సమయంలో దాని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పూర్తిగా ప్రభావితం కావడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.​గ్రీన్ టీలోని టానిన్లు శరీరంలో ఐరన్ శోషణను అడ్డుకుంటాయి. దీంతో, రక్తహీనత సమస్యతో బాధపడేవారు గ్రీన్ టీకి దూరంగా ఉండాలి. రక్తహీనత సమస్య ఉన్నవారు గ్రీన్ టీ తాగడం వల్ల ఐరన్ లోపం మరింత ఎక్కువ కావచ్చు. ఇప్పటికే లివర్ సమస్యలతో బాధపడేవారు గ్రీన్ టీకి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అధిక మోతాదులో గ్రీన్ టీ తీసుకోవడం వల్ల లివర్‌పై ప్రతికూల ప్రభావం ఉండవచ్చని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+