ఉపేక్షించవద్దు, సోషల్ మీడియా పోస్టులపై కేబినెట్ కీలక ఆదేశాలు..!!
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. దాదాపు 30 అంశాల పైన చర్చ జరిగి ఆమోదం తెలిపారు. కాగా, తాజాగా వివాదాస్పదం అయిన సోషల్ మీడియా అంశం పైనా చర్చించారు. డీజీపీ, ఇతర పోలీస్ అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కాగా, భావ ప్రకటనా స్వేచ్ఛను గౌరవిస్తూనే అభ్యంతరకర వ్యాఖ్యలను ఏ మాత్రం ఉపేక్షించవద్దని పోలీస్ అధికారులకు కేబినెట్ ఆదేశాలు జారీ చేసింది.
మంత్రివర్గ సమావేశంలో సోషల్ మీడియా పైన కీలక చర్చ జరిగింది. పలువురు మంత్రులు ఇదే అంశం పైన తమ అభిప్రాయాలను వెల్లడించారు. సమావేశానికి ప్రభుత్వ సూచనతో హాజరైన డీజీపీ, పోలీస్ అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా..కించపరిచేలా వస్తున్న వీడియోలపై మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. భావ ప్రకటనా స్వేచ్ఛను గౌరవిస్తూనే అభ్యంతరకర వ్యాఖ్యలను ఏ మాత్రం ఉపేక్షించవద్దని పోలీస్ అధికారులకు కేబినెట్ ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం వెంటనే టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులకు స్పష్టం చేసిన కేబినెట్.. ఇందు కోసం అవసరమైతే బయటనుంచి సిబ్బందిని తీసుకోవాలని సూచించింది. న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా కొత్తగా పీపీలను నియించుకోవాలని ఏపీ కేబినెట్ ఆదేశాలు జారీ చేసింది.

పోలీసు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు
ఉద్దేశ పూర్వకంగా ప్రభుత్వంపై అభూత కల్పనలు, అసత్యాలు, అసలు విషయాలు వక్రీకరిస్తే మాత్రం ఉపేక్షించవద్దని మంత్రు గట్టిగా కోరినట్లు తెలుస్తోంది. ఈరోజు నుంచే సోషల్ మీడియాపై పోలీస్ యంత్రాంగం పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించాలని స్పష్టం చేసింది. ఇప్పటికే సోషల్ మీడియాపై ప్రభుత్వం నియమించిన కేబినెట్ సబ్ కమిటీలో కూడా చర్చించాలని ఆదేశించింది. వైసీపీ నేతలు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం నుంచి దృష్టి మరల్చేందుకు కొత్తగా కావాలని ఎమ్మెల్యేలను రెచ్చగొడుతున్నారని... వైసీపీ వాళ్లు రెచ్చగొడితే రెచ్చిపోవద్దని సూచించారు. వైసీపీ ట్రాప్‌లోకి లాగేందుకు చూస్తోందని.. జాగ్రత్తగా ఉండాలన్నారు. అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రజలకు వివరించాలని మంత్రులకు సూచించారు. ఇన్‌ఛార్జి మంత్రులు జిల్లాలకు వెళ్లిన సమయంలో ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకోవాలని సీఎం ఆదేశించారు. ఇన్‌ఛార్జి మంత్రులు.. రెవెన్యూ, ఇతర సమస్యలపై కూడా ఫోకస్ పెట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేసారు. అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యలను వెంటనే కేబినెట్ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించాలని సీఎం ఆదేశించారు.













Click it and Unblock the Notifications