ఇదే నా చివరి సినిమా మహేష్ బాబు సంచలన కామెంట్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు ,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా 'గుంటూరు కారం'. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన మూడో సినిమా కావడంతో 'గుంటూరు కారం' భారీ అంచనాలు ఏర్పడ్డాయి.సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్సడ్ టాక్ సొంతం చేసుకుంది.

కథలో కొత్తదనం లేదని మహేష్ అభిమానులే సినిమాపై విమర్శలు చేస్తున్నారు. త్రివిక్రమ్ మార్క్ లేకపోవడంతో పాటు, ఆయన గత సినిమాలను గుర్తు చేయడంతో బాక్సాఫీస్ వద్ద గుంటూరు కారం ఎబో యావరేజ్‌గా నిలుస్తుందని అందరు భావించారు. అయితే రెండో రోజు నుంచి సినిమా టాక్ పూర్తిగా మారిపోయింది. 'గుంటూరు కారంకు ఫ్యామిలీ ఆడియోన్స్ క్యూ కట్టడంతో వసూళ్లు మరింత పుంజుకున్నాయి.

That was my last movie Mahesh Babu sensational comments

దీంతో చిత్ర యూనిట్ సక్సెస్ సంబంరాలు చేసుకుంది. మహేష్ బాబుతో పాటు, హీరోయిన్లు శ్రీలీల, మీనాక్షి చౌదరిలతో పాటు చిత్ర నిర్మాత నాగవంశీ, దిల్ రాజు ఈ సక్సెస్ పార్టీలో పాల్గొన్నారు.ఇదిలా ఉంటే సినిమాకు ముందు ప్రమోషన్స్‌కు దూరంగా ఉన్న మహేష్ బాబు.. సినిమా రిలీజ్ అయిన నాలుగు రోజుల తరువాత ఓ ప్రమోషన్స్ వీడియోను విడుదల చేశారు.

యాంకర్ సుమ హోస్ట్‌గా వ్యవహరించిన ఈ ప్రమోషన్ వీడియోలో హీరో మహేష్ బాబు, హీరోయిన్ శ్రీలీల పాల్గొన్నారు. సినిమా విశేషాలతో పాటు, షూటింగ్ సమయంలో జరిగిన ఘటనల గురించి వీరిద్దరు వివరించారు. సినిమా కోసం చాలా కష్టపడ్డానని.. డ్యాన్స్ వేయలని నేను త్రివిక్రమ్ ముందుగానే నిర్ణయించుకున్నామని.. దానికి దక్కట్టుగానే రెండు పాటలకు డ్యాన్స్ వేసినట్టు మహేష్ బాబు వివరించారు.

ఇలా తాను డ్యాన్స్ వేయడం ఇదే చివరి సినిమా అనుకుంటున్నానని... తరువాత రాజమౌళి దర్శకత్వంలో సినిమా ఉంటుంది కాబట్టి బహుశ అందులో ఇలాంటి అవకాశం వస్తుందో లేదో అని మహేష్ బాబు చెప్పుకొచ్చారు. తెలుగులో ఇదే తన చివరి సినిమా .. తరువాత అన్నీ కూడా ప్యాన్ ఇండియా రేంజ్‌లోనే ఉంటాయని మహేష్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+