అందుకే ఆ పని చేశా.. సీక్రెట్ రివీల్ చేసిన నాగార్జున హీరోయిన్
అక్కినేని నాగార్జున నటించిన 'మన్మథుడు'సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ అన్షు. తనదైన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె ఆ తర్వాత ప్రభాస్ సరసన రాఘవేంద్ర మూవీలో నటించింది. కానీ అనుకోకుండా సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. పెళ్లి కూడా చేసేసుకుంది. ఇక రీసెంట్ గానే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన అన్షు.. యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ మజాకా లో ప్రత్యేక పాత్రలో నటించింది.
సినిమా రిజల్ట్ పక్కన పెడితే చాలా కాలం తర్వాత ఆమెను బిగ్ స్క్రీన్ పై చూసి అభిమానులు ఫుల్ ఫిదా అయిపోయారు. అయితే మూవీ ఈవెంట్ లలో డైరెక్టర్ ఆమె గురించి షాకింగ్ కామెంట్స్ చేయడం పెద్ద దుమారం క్రియేట్ చేస్తే.. ప్రమోషన్స్ టైంలో ఆమె తలకు గాయమై కనిపించడం అందరినీ షాక్ కి గురి చేసింది. తలకి ఓ బ్యాండేజీతో కనిపించిన ఆమె.. ఏం జరిగిందని చెప్పకపోవడం పలు అనుమానాలకు దారి తీసింది. కొందరు అయితే పబ్లిసిటీ కోసం అలా చేసుంటారని నెగిటివ్ కామెంట్స్ సైతం చేశారు.

ఇక ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోని షేర్ చేస్తూ అసలు విషయాన్ని చెప్పింది అన్షు. ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. ఇది తాను పబ్లిక్ స్టంట్ కోసం చేయలేదు.. ఇది నిజమైన గాయమే.. నెల క్రితమే ఈ ఘటన జరిగింది నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ వల్ల నేను బయటపడ్డాను ఇది ఒక చేదు అనుభవం త్వరలోనే దీని నుంచి కోల్కొని నేను స్ట్రాంగ్ గా మారతానని నాకు నమ్మకం ఉందని వెల్లడించారు. మొత్తంగా ఆ వీడియోతో ట్రోలర్స్ కి అన్షు కౌంటర్ ఇచ్చిందని ఆమె ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
మజాకా మూవీ విషయానికి వస్తే బజ్ అయితే ఏర్పడింది కానీ ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. త్వరలోనే ఓటీటీలోకి రాబోతున్న మూవీ అక్కడ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి. అన్షు సైతం ప్రస్తుతం పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని.. టాలీవుడ్ లో మళ్లీ ఈ ముద్దుగుమ్మ బిజీ అవ్వడం ఖాయమని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications