ఫ్లైఓవర్ల కింద ఇండోర్ సబ్‌స్టేషన్లు.. హైదరాబాదీల కరెంట్ కష్టాలకు చెక్!

హైదరాబాద్ లో విపరీతమైన విద్యుత్ డిమాండ్ ఉంది. నగర జనాభా రోజురోజుకీ పెరుగుతున్నారు. హైదరాబాద్ లో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా కొత్త సబ్ స్టేషన్లు ఏర్పాటు చెయ్యాల్సిన అవసరం ఏర్పడింది. అయితే నగరంలో భూమి అందుబాటులో లేకపోవటం, ఉన్న స్థలాల ధరలు అధికంగా ఉండటం వలన తెలంగాణా సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కొత్త మార్గం ఎంచుకుంది.

ఇండోర్ విద్యుత్ సబ్ స్టేషన్ లు నిర్మించాలని నిర్ణయం

హైదరాబాద్ నగరంలో విద్యుత్ అవసరాలను తీర్చేలా ఫ్లై ఓవర్లు, స్టీల్ బ్రిడ్జ్ ల క్రింద ఉన్న ఖాళీ స్థలాలను ఉపయోగించి ఆధునిక ఇండోర్ విద్యుత్ సబ్ స్టేషన్ లు నిర్మించాలని నిర్ణయం చేసింది. సాధారణ సబ్ స్టేషన్ లు ఏర్పాటు చెయ్యాలంటే కావలసిన భూమి కొనుగోలుకు 8నుండి 10కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా.. దీంతో భూములు కొనుగోలు ఖర్చు తగ్గేలా తెలంగాణా సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ శ్రీకారం చుట్టింది.

electricity indoor substations under flyovers with latest technology first project at Musheerabad

నాయిని నరసింహారెడ్డి స్టీల్ ఫ్లైఓవర్ క్రింద స్థల పరిశీలన

ఈ వినూత్న ప్రయోగానికి ముషీరాబాద్ లోని నాయిని నరసింహారెడ్డి స్టీల్ ఫ్లైఓవర్ వేదిక కానుంది. నాయిని నరసింహారెడ్డి స్టీల్ ఫ్లైఓవర్ క్రింద సబ్ స్టేషన్ నిర్మించాలని నిర్ణయం తీసుకున్న క్రమంలో ఇండోర్ సబ్ స్టేషన్ స్థలాన్ని కంపెనీ చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ జితేష్ వి. పాటిల్, ప్రాజెక్ట్ ల డైరెక్టర్ వి. శివాజీ పరిశీలించారు.

అన్ మ్యాన్డ్ ఇండోర్ స్టేడియంగా అభివృద్ధి

ముషీరాబాద్ బస్ డిపో సమీపంలో 63, 64 స్తంభాల మధ్య 33/11 కేవీ సబ్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు. లే అవుట్, ఇన్ కమింగ్ లైన్లు, అవుట్ గోయింగ్ ఫీడర్లు, భూగర్భ కేబుళ్ళు, భద్రతా అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సబ్ స్టేషన్ ను పూర్తిగా అన్ మ్యాన్డ్ ఇండోర్ స్టేడియంగా అభివృద్ధి చేయనున్నారు. దీనిని మానవ రహితంగా రిమోట్ టెర్మినల్ యూనిట్ ద్వారా దూరం నుండే పర్యవేక్షించేలా, ఆపరేషన్లు నిర్వహించేలా ఏర్పాటు చేయనున్నారు.

తనపై కోర్టు ధిక్కరణ కేసుల వెనుక ఎవరున్నారో చెప్పిన హైడ్రా ఏవీ రంగనాథ్
తనపై కోర్టు ధిక్కరణ కేసుల వెనుక ఎవరున్నారో చెప్పిన హైడ్రా ఏవీ రంగనాథ్

ఇది సక్సెస్ అయితే నగరంలో అనేక చోట్ల ఇదే తరహా సబ్ స్టేషన్లు

ఇది అందుబాటులోకి వస్తే ముషీరాబాద్ పరిసరాల్లో ఉన్న ఐదు సబ్ స్టేషన్ లపై భారం తగ్గి నాణ్యమైన విద్యుత్ సరఫరా నిరంతరాయంగా పొందే అవకాశం ఉంది. అయితే ఈ సబ్ స్టేషన్ నిర్మాణ వ్యయం సుమారు 10కోట్ల రూపాయల నుండి 12 కోట్ల రూపాయలుగా ఉంటుందని అంచనా. ఫ్లై ఓవర్ క్రింద స్థలం ఉపయోగించటం కారణంగా భూమి ఖర్చు తగ్గుతుంది. నగరంలోని స్థలాభావ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే నగరంలోని ఇతర ప్రాంతాలలో కూడా ఇలాంటి ఇండోర్ సబ్ స్టేషన్ లు ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+