Manchu Lakshmi : మంచు లక్ష్మి ఎక్కడికి వెళ్లింది..!
మంచు ఫ్యామిలీ పంచాయితీ పోలీస్ స్టేషన్ కు చేరింది. దీనిపై పోలీసులు విచారణ జరపనున్నారు. అయితే మంచు కుటుంబ వివాదం డైలీ సీరియల్ తరహాలో కొనసాగుతోంది. ఆదివారం ఉదయం మంచు మనోజ్ తండ్రి మోహన్ బాబుపై ఫిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చాయి. అలాగే మోహన్ బాబు కూడా పోలీసులు ఫిర్యాదు చేసినట్లు కథనాలు వచ్చాయి. మధ్యాహ్నానికి దీనిపై మంచు ఫ్యామిలీ క్లారిటీ ఇచ్చింది. మీడియాలో ఊహాజనిత కథనాలు వస్తున్నాయని.. వాటిని ఖండిస్తున్నట్లుగా ప్రకటన విడుదల చేశారు.
అయితే ఆదివారం సాయంత్రం మంచు మనోజ్ బంజారాహిల్స్ లోని ఓ ఆస్పత్రికి వచ్చారు. నడవలేని స్థితిలో ఆస్పత్రిలో చేరి.. తర్వాత డిశ్చార్చ్ అయ్యారు. సోమవారం కొన్ని నాటకీయ పరిణామాల తర్వాత మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం మోహన్ బాబు కూడా రాచకొండ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. తనకు ప్రాణ హానీ ఉందని పేర్కొన్నారు. మనోజ్ కొంత మంది వ్యక్తులతో అక్రమంగా తన ఇంట్లోకి ప్రవేశించినట్లు ఆరోపించారు.

ఈ నేపథ్యంలోనే మంచు విష్ణు దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. నేరుగా జల్ పల్లిలోని ఇంటికి చేరుకున్నారు. అక్కడున్న బౌన్సర్ల బయటకు పంపి ఇది తమ కుటుంబ విషయమని.. తాము మాట్లాడుకుంటామని చెప్పారు. అయితే ఇంత జరుగుతున్నా.. మంచు లక్ష్మి ఏం చేస్తుందని సోషల్ మీడియాలో పలువురు ప్రశ్నిస్తున్నారు. సోమవారం మంచు లక్ష్మి జల్ పల్లి లోని మోహన్ బాబు ఇంటికి వెళ్లారు. మంచు మనోజ్, తండ్రితో చర్చలు జరిపారు. అనంతరం అక్కడ నుంచి కారులో వెళ్లిపోయారు.
ఆ తర్వాత మళ్లీ రాలేదు. కాగా ఆమె తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఓ స్టోరీ పోస్ట్ చేశారు. ఫొటోను బట్టి ఆమె హైదరాబాద్ లో లేనట్లు తెలుస్తోంది. లక్ష్మి విమానంలో వేరే ప్రాంతానికి వెళ్లిపోయినట్లు సమాచారం. మంచు లక్ష్మి ప్రస్తుతం ముంబై ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ఆమె తనకు రావాల్సి ఆస్తి తీసుకుని ముంబైలో సెటిల్ అయినట్లు సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతోంది. మరో పక్క మంచు మనోజ్ రాష్ట్ర డీజీపీ కలిసినట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications