బాలకృష్ణ - నాగార్జున మధ్య గొడవ జరగడానికి కారణం?

నందమూరి నటసింహం బాలకృష్ణ, కింగ్ నాగార్జు తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర కుటుంబాలకు చెందినవారు. తమ తండ్రులైన ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు తెలుగు సినీ పరిశ్రమకు రెండు కళ్లులాంటివారు. పరిశ్రమ ఈరోజు ఈ స్థాయిలో ఉందంటే అందుకు కారణం వారిద్దరూ ప్రధానమని చెప్పొచ్చు. తండ్రుల నుంచి వారసత్వంగా నటనను స్వీకరించి కొన్ని దశాబ్దాలుగా అగ్ర కథానాయకులుగా చెలామణి అవుతున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా తీయాలని ఎంతోమంది దర్శక నిర్మాతలు ప్రయత్నించారుకానీ సరైన కథ దొరకకపోవడంతో అది సాధ్యపడలేదు.

బద్ధ శత్రువుల్లా మారారు
కొన్నాళ్ల క్రితం వరకు కూడా ఈ ఇద్దరూ ఎంతో స్నేహంగా ఉండేవారు. ఒకరి వేడుకకు మరొకరు హాజరవడం.. ఇద్దరూ ఛలోక్తులు విసుకోవడంతోపాటు ఎంతో సరదాగా ఉండేవారు. ఏమైందో తెలియదుకానీ హఠాత్తుగా వీరిద్దరి మధ్య దూరం పెరిగింది అనేకన్నా బద్ధ శత్రువుల్లా మారానని ఫిల్మ్ నగర్ వర్గాలు వ్యాఖ్యానిస్తుంటాయి.

these are the main reasons clashes between hero balakrishna and nagarjuna

అంతటి సంఘటన ఇంతవరకు బయటకు రాలేదు. కానీ దూరం మాత్రం రోజురోజుకు పెరిగిపోతోంది. ఇటీవలే ఓ కార్యక్రమంలో పాల్గొన్న బాలయ్య అక్కినేని, తొక్కనేని అంటూ నోటి దురుసుతో వ్యాఖ్యానించారు. దీనిపై అక్కినేని అభిమానులు బాలకృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు నాగచైతన్య పరోక్షంగా కౌంటర్ ఇచ్చాడు.

జోష్ ఆడియో ఫంక్షన్ లో బాలయ్య
నాగచైతన్య కథానాయకుడిగా పరిచయం అవుతున్న జోష్ చిత్రం ఆడియో ఫంక్షన్ కు బాలయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ అక్కినేని నాగేశ్వరరావు తనకు బాబాయ్ అవుతారని, నాగార్జునలో అన్నీ నాగేశ్వరరావు పోలికలే ఉంటాయని, నాగ్ పక్కా కమర్షియల్ బిజినెస్ మ్యాన్ గా కనిపిస్తుంటారని వ్యాఖ్యానించారు.

ఆ మాటలకే నాగార్జున తీవ్రంగా బాధపడ్డాడని చెబుతున్నారుకానీ దీనికి మించిన సంఘటన ఏదో జరిగిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈరోజుకు కాకపోయినా మరో రోజుకైనా అది బయటకు వస్తుంటుందన్నారు. ఆడియో వేడుకలో మాట్లాడిన మాటలవల్ల మనసు బాధపడినప్పటికీ ఇద్దరి మధ్య తీవ్రమైన విభేదాలు వచ్చేంత దూరం పెరగదని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరి ఆ విషయం ఎప్పుడు బయటకు వస్తుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+