ఈ ఏడాది హయ్యస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్
దక్షిణ భారతదేశంలో స్టార్ హీరోయిన్లు బాలీవుడ్ లో కూడా తమ హవాను కొనసాగిస్తున్నారు. యానిమల్ సినిమాతో రష్మిక మరో హిట్ ను తన ఖాతాలో వేసుకోగా, జవాన్ తో నయనతార బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. సిటాడెల్ సిరీస్ తో సమంత సిద్ధమైంది. త్రిష, కీర్తి సురేష్, సాయిపల్లవి లాంటివారు కూడా పారితోషికాన్ని భారీగా తీసుకుంటున్నారు. వాటి వివరాలు తెలుసుకుందాం.
అనారోగ్యం వల్ల ప్రస్తుతం సినిమాల నుంచి కాస్త విరామం తీసుకున్నప్పటికీ ఖుషి సినిమాతో సమంత హిట్ అందుకుంది. సిటాడెల్, చెన్నై స్టోరీస్ తో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఒక్కో సినిమాకు సమంత రూ.4కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుంది. తెలుగు, తమిళంలో స్టార్ హీరోయిన్ నయనతార హీరోల కన్నా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటుంది. తాజాగా ఆమె జవాన్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమాలో నటించినందుకు నయన్ ఏకంగా రూ. 10 కోట్ల పారితోషికం తీసుకుంది. ఈ ముద్దుగుమ్మ చేసే తదుపరి చిత్రాలకు రెమ్యునరేషన్ ను భారీగా పెంచి అడుగుతోంది.

సుమారు 21 సంవత్సరాలుగా దక్షిణాదిలో ఓ వెలుగు వెలుగుతోంది త్రిష. నాలుగు పదుల వయసులోనూ బ్యాక్ టూ బ్యాక్ లతో ప్రేక్షకులను ఈ అమ్మడు అలరించడమేకాదు.. రెమ్యూనరేషన్ ను కూడా భారీగా పెంచేసింది. ఒక్కో సినిమాకు దాదాపు రూ.5 కోట్లు తీసుకుంటోంది. తమన్నా కూడా భారీగానే తీసుకుంటుంది. ప్రస్తుతం ఈ మిల్క్ బ్యూటీ రూ. 7 కోట్లు డిమాండ్ చేస్తోంది. కీర్తి సురేష్ కూడా భారీగానే తీసుకుంటుంది. ప్రస్తుతం ఆమె సినిమాకు రూ.3 కోట్లు తీసుకుంటోంది. హీరోయిన్ల రెమ్యునరేషన్ జాబితా పరిశీలిస్తే వీరందరిలో నయనతార టాప్ ప్లేస్ లో నిలుస్తోంది. స్టార్ హీరోకు సమానంగా ఆమె పారితోషికం ఉంటుంది. జవాన్ తర్వాత పారితోషికాన్ని మరింత పెంచింది. రూ.12 కోట్లు అడుగుతున్నట్లు తెలుస్తోంది.
-
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
తెలుగు హీరోయిన్ వీడియో వైరల్ !! -
చెప్పుతో పాటు ఆ సింబల్ చూపించిన స్టార్ బ్యూటీ.. కారణం అదే ??? -
రిలీజ్‌కి ముందే ప్రీ రిలీజ్ బిజినెస్‌తో రికార్డ్.. చిన్న సినిమా కాదయ్యో !! -
తెలుగులో తొలి ఏఐ సినిమా! -
12 రోజుల్లో రూ.1400 కోట్లు.. చరిత్ర తిరగరాసిన ‘ధురంధర్2’ -
ఇండస్ట్రీలో ఉండాలంటే కమిట్మెంట్ కు ఒప్పుకోవాల్సిందే: నటి సంచలన కామెంట్స్ వైరల్ -
టాలీవుడ్ vs పొలిటీషియన్స్: డ్రగ్స్ టెస్ట్ రచ్చ! -
అద్దె పోయి వాటా వచ్చింది. సింగిల్ స్క్రీన్స్‌లో మల్టీప్లెక్స్ రూల్స్ -
అల్లు అర్జున్‌కు బాగా ఇష్టమైన మహేష్‌బాబు సినిమా -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..!












Click it and Unblock the Notifications