ఆర్టీసీ ప్రయాణికులకు మరో అదిరిపోయే శుభవార్త చెప్పిన మంత్రి పొన్నం ప్రభాకర్!
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టిసి ప్రయాణికులకు శుభవార్త. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుండి వివిధ ప్రాంతాలకు ప్రయాణించే ప్రయాణికుల కోసం బస్సు టెర్మినల్స్ ను రద్దీకి అనుగుణంగా అభివృద్ధి చేయడానికి రవాణా శాఖ చర్యలు చేపట్టింది. ఈ మేరకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ మరియు ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని టెర్మినల్స్ సౌకర్యాలను మెరుగుపరచనున్నట్టు ఆయన పేర్కొన్నారు.
ఎంఎంటీఎస్, మెట్రో స్టేషన్లతో ఆర్టీసీ సర్వీసుల అనుసంధానం చేస్తాం : మంత్రి పొన్నం ప్రభాకర్
ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో ఎంఎంటీఎస్, మెట్రో స్టేషన్లతో ఆర్టీసీ సర్వీసులను మరింత సమర్థవంతంగా అనుసంధానం చేసే పనులు కూడా జరుగుతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ చర్యల వల్ల ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా, సౌకర్యవంతంగా ప్రయాణం చేసే వీలు కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఇదే సమయంలో ఆర్టీసీ సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం కూడా మంత్రి హామీ ఇచ్చారు.

శంకర్ కుటుంబానికి చేయూత ద్వారా సేకరించిన 90,85,500 రూపాయల చెక్కు
ఇటీవల సమ్మె సమయంలో నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ కోల శంకర్ మృతి చెందిన ఘటనపై స్పందించిన మంత్రి ఆర్టీసీ సిబ్బంది చేయూత కార్యక్రమం ద్వారా సేకరించిన 90 లక్షల 85 వేల 500 రూపాయల చెక్కును శంకర్ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఉన్నతాధికారులు, కార్మిక సంఘాల నాయకులతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే దిశగా చర్యలు
అంతేకాదు శంకర్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని, ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు ఇదే సమయంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేలా ఆర్టీసీ నిర్ణయాలు
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఆర్టీసీ బస్సులు ప్రతిరోజు వేలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తూ సేవలు అందిస్తున్నాయి. టెర్మినల్ అభివృద్ధి, మెట్రో ఎంఎంటీఎస్ అనుసంధానం చేయడం వల్ల ఆర్టీసీ ప్రయాణికులకు సౌకర్యాలు మెరుగుపడతాయి. ఇలాంటి చర్యలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కూడా బలోపేతం చేస్తాయి.












Click it and Unblock the Notifications