తెలంగాణలో బీజేపీ బెంగాల్ ఫార్ములా - రంగంలోకి కొత్త వ్యూహకర్తలు, గేమ్ ఛేంజ్..!!
తెలంగాణ పైన బీజేపీ గురి పెట్టింది. దక్షిణాది పైన ఫోకస్ చేసిన పార్టీ నాయకత్వం తెలంగాణ ఎన్నికలను ఈ సారి ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. కాంగ్రెస్ దక్షిణాది రాష్ట్రాల్లో మరింతంగా బలపడే ఆలోచనల వేళ బీజేపీ అలర్ట్ అయింది. అందులో భాగంగా తెలంగాణలో కొత్త వ్యూహకర్త లను రంగంలోకి దింపింది. పశ్చిమ బెంగాల్ లో అమలు చేసిన ఫార్ములానే ఇక్కడే అనుసరించా లని నిర్ణయించారు. ఇందు కోసం కీలక నేతలకు బాధ్యతలు అప్పగించారు.
తెలంగాణ పైన బీజేపీ ఈ సారి కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. ఇప్పటికే నేతల మధ్య విభేదాల పైనా హెచ్చరికలు చేస్తోంది. నేతలు సమన్వయంతో పని చేయాలని.. లేకుంటే ఎలాంటి చర్యల కైనా వెనుకాడేది లేదని పార్టీ తేల్చి చెబుతోంది. ఇదే సమయంలో బెంగాల్ లో రికార్డు మోజార్టీ సాధించిన బీజేపీ తెలంగాణలోనూ అదే ఫార్ములా అనుసరించాలని డిసైడ్ అయింది. బెంగాల్ లో ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచే ప్రణాళికలను అమలు చేసి సక్సెస్ అయింది.

అందులో భాగంగా బీజేపీ కోసం ప్రధానంగా పని చేసే రెండు ఎన్నికల స్ట్రాటజీ టీంలు.. ఏబీఎం, జార్విస్ సంస్థలు రంగంలోకి దిగాయి. తెలంగాణలో రాజకీయ పరిస్థితులు.. బీజేపీ బలాలు- బలహీనతల తో పాటుగా కొత్త వ్యూహాల పైన పార్టీకి నివేదికలు ఇవ్వనున్నాయి. ఇందు కోసం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేయనున్నాయి. ఇక.. అమిత్ షా టీం నేరుగా తెలంగాణ బాధ్యతలు పర్యవేక్షిస్తోంది.
పశ్చిమ బెంగాల్ లో గెలిచిన తరువాత బీజేపీ వై నాట్ తెలంగాణ నినాదం వినిపిస్తోంది. మమత ను ఓడించిన వ్యూహాలే తెలంగాణలోనూ అమలు చేయటం ద్వారా అధికారం దక్కుతుందనే నమ్మకంతో పార్టీ నేతలు ఉన్నారు. ఇందు కోసం పార్టీ అధినాయకత్వం నమ్మే రెండు పొలిటికల్ కన్సెల్టెన్సీలకు బాధ్యత అప్పగించింది. వీరితో పాటుగా పార్టీ ముఖ్య నేతల టీంలు రంగంలోకి దిగాయి. వీరు నేరుగా బీఎల్ సంతోష్ కు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు.

క్షేత్ర స్థాయి నివేదికల ఆధారంగా హోం మంత్రి అమిత్ షా.. మిషన్ తెలంగాణ పైన పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేసేలా కార్యాచరణ సిద్దం అయిందని తెలుస్తోంది. ఐ ప్యాక్ తరహాలోనే ఈ రెండు ఏజెన్సీ లు బీజేపీ కోసం పని చేయనున్నాయి. శ్రావణ మాసంలో పార్టీలో చేరికలు ఉంటాయని ముఖ్య నేతల సమాచారం. ముందుగా గ్రేటర్ ఎన్నికలను లక్ష్యంగా ఎంచుకున్నారు. దీంతో.. రానున్న రోజుల్లో తెలంగాణ కేంద్రంగా బీజేపీ అధినాయకత్వం తీసుకునే నిర్ణయాల పైన రాజకీయంగా ఆసక్తి నెలకొంది.












Click it and Unblock the Notifications