టాలీవుడ్ నటి పూజా హెగ్దే ఇంట విషాదం..
టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. నటి పూజా హెగ్దే తన అమ్మమ్మను కోల్పోయింది. అమ్మమ్మ అంటే పూజకు ఎనలేని ప్రేమ. తనను ప్రాణంగా చూసుకునే అమ్మమ్మ లేని విషయాన్ని పూజ జీర్ణించుకోలేకపోతుందట. పూజా హెగ్డేకి ఎంతో ఇష్టమైన తన అమ్మమ్మ కొద్దిరోజుల క్రితం మృతిచెందారు.
పూజా హెగ్డే తల్లి లతా హెగ్డే అమమ్మ ఈ మధ్యకాలంలో కన్నుమూశారు. దాంతో ఆ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఈ సందర్భంగా గతంలో ఆమెతో గడిపిన క్షణాలను పూజ నెమరువేసుకున్నారు. అమ్మమ్మతో కలిసి దిగిన ఫోటోలను సోషల్‌మీడియాలో తన ఖాతాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు తాజాగా అమ్మమ్మతో కలిసి దిగిన ఫోటోని పూజా షేర్ చేయడం జరిగింది. ఇందులో 'వుయ్ మిస్ యు అజి' అంటూ ఎమోషనల్ కొటేషన్‌ను కూడా రాశారు.

ప్రస్తుతం ఈ ఫోటోలు కాస్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. పూజ అమ్మమ్మకి కొంతమంది నెటిజన్లు సంతాపం కూడా ప్రకటిస్తుంటే, మరికొందరేమో పూజను ఓదార్చే పనిలో ఉన్నారు. రెండు రోజుల క్రితమే పూజా హెగ్దే ఇంట్లో ఓ వేడుక జరిగింది. ఇంతలో ఇలాంటి సంఘటన జరగడతంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
పూజా హెగ్దే సిస్టర్ భూమి శెట్టి వివాహం చేసుకుంది. ఈ వివాహ వేడుకలో పూజా కుటుంబంతో కలిసి ఎంతో సంతోషంగా గడిపింది. ఆ సంతోషం మరెన్నిరోజులు నిలవలేదు. ఈ పెళ్లి వేడుకులో వారి అమ్మమ్మ కూడా ఉన్నారు. పెళ్లిలో సంతోషంగా గడిపిన అమ్మమ్మ వెళ్లిపోవడంతో ఆ కుటుంబాన్ని విషాద ఛాయలు అలుముకున్నాయి.
బాలీవుడ్‌లో అడుగుపెట్టిన బుట్టబొమ్మ...
ఇక, పూజాహెగ్దే టాలీవుడ్‌లో స్టార్ హీరోలందరితో నటించి తెలుగులో మంచి నటిగా గుర్తింపు సంపాదించింది. అల్లుఅర్జున్ నటించిన అలవైకుంఠపురం సినిమాతో బుట్టబొమ్మగా పేరు సంపాదించుకుంది. బాలీవుడ్‌లోనూ ఈ బామ్మ అడుగుపెట్టింది. సల్మాన్‌ఖాన్‌తో కిసికా జాన్ మూవీలో నటించింది. ఆ మూవీ ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. ఇక, ఇప్పటివరకూ ఆమె తెలుగులో కొత్త సినిమాలేవి సైన్ చేయలేదు.












Click it and Unblock the Notifications