హాలీవుడ్‌లో విషాదం..టైటానిక్, అవతార్ చిత్రాల నిర్మాత మృతి..
హాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ హాలీవుడ్ నిర్మాత, 'టైటానిక్', 'అవతార్ మూవీల ప్రొడ్యూసర్ జాన్ లాండౌ (63) కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన లాస్ ఏంజిల్స్‌లో ఈ నెల 5వ తేదిన మృతి చెందినట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. ఈ విషయాన్ని వారే స్వయంగా సోషల్‌మీడియా వేదికగా వెల్లడించారు.
జోన్ లండౌ 16 నెలల పాటు క్యాన్సర్‌తో పోరాటం చేసి, చివరికి మృతిచెందారు. అయితే, ఈ విషాదకరమైన వార్త కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు, ఆయన అభిమానులు జాన్ లాండౌకు సంతాపం తెలియజేశారు. ఇక జోన్ లండౌ మృతిపట్ల హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరాన్, సామ్ వర్తింగ్స్‌టన్ వారితో పాటు తదితరులు సంతాపం ప్రకటించారు.

జాన్ లాండౌ1980లో ప్రొడక్షన్ మేనేజర్‌గా హాలీవుడ్ తన కెరీర్ ప్రారంభించారు. ఆయన నిర్మించిన చిత్రాలలో టైటానిక్ ఆస్కార్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాతో ఆయనకు ఒక ప్రత్యేక గుర్తింపు కూడా లభించింది. టైటానికి చిత్రాన్ని జాన్ లాండౌ 1997లో నిర్మించారు. ఈ సినిమా కోసం అప్పట్లోనే ఆయన 200 మిలియన్ల ఖర్చుపెట్టారట. అయితే, ఈ చిత్రం ఆ సమయంలోనే రికార్డుల వర్షం కురిపించింది. సూమారు రూ.500 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. టైటానికి చిత్రానికి 11 ఆస్కార్ అవార్డులు కూడా వచ్చాయి. టైటానిక్ సినిమా అత్యధిక ఆస్కార్ అవార్డులు అందుకున్న చిత్రాలలో రెండో స్థానంలో నిలవడం విశేషం.
అవతార్ సిరీస్‌లు..
టైటానిక్ చిత్రంతో పాటు మరికొన్ని సినిమాలను కూడా ఆయన నిర్మించారు. అందులో అవతార్ చిత్రం గురించి చెప్పుకోవాల్సిందే. అవతార్ సినిమా 2009లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు, ఈ చిత్రం సుమారు రూ.24 వేల కోట్ల వసూళ్లను రాబట్టింది. ప్రపంచంలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా అవతార్ నిలిచింది. అవతార్ సిరీస్‌లోని మరో రెండుభాగాలను కూడా జాన్ లాండౌనే నిర్మించారు. ఇందులో 3వ భాగం 2026లో, 4వ భాగం 2030లో విడుదల కానున్నాయి.












Click it and Unblock the Notifications