డ్రగ్స్ కేసులో హీరోయిన్ అరెస్ట్..?
డ్రగ్స్ కేసు సినిమా ఇండస్ట్రీని ఓ కుదుపు కుదిపిన సంగతి అందరికి తెలిసిందే. అప్పట్లో డ్రగ్ పార్టీలకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. డ్రగ్స్ కేసులో హీరో ,హీరోయిన్లతోపాటు, పలువురు క్యారెక్టర్ ఆర్టిస్టుల పేర్లు తెర మీదకు వచ్చాయి. దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరో తరుణ్, రవితేజ, ముమైత్ ఖాన్ ఛార్మీ కౌర్, నవదీప్ వంటి సెలబ్రిటీలు డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొన్నారు.
డ్రగ్స్ కేసుకు సంబంధించి అప్పటి ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి.. నెలల తరబడి విచారణ జరిపినా ఫలితం లేకపోయింది. ఇదిలా ఉంటే తాజాగా డ్రగ్ర్ కేసులో ఓ హీరోయిన్ పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు. వరలక్ష్మి శరత్ కుమార్. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో వరలక్ష్మి శరత్ కుమార్‌కు మంచి గుర్తింపు ఉంది. ముఖ్యంగా తెలుగు సినిమాల్లో విలన్ పాత్రల్లో నటిస్తూ ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకుంది.

రవితేజ ''క్రాక్'' ,బాలకృష్ణ ''వీరసింహారెడ్డి''.. సినిమాల్లో వరలక్ష్మి నటనకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. తాజాగా ఈ అమ్మడు గురించి కోలీవుడ్ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కెర్లు కొడుతుంది. గతంలో కోలీవుడ్ డ్రగ్స్ కేసులో వరలక్ష్మి శరత్ కుమార్ పేరు కూడా బయటకు వచ్చిన విషయం తెలిసిందే. వరలక్ష్మి మేనేజర్ ఆదిలింగం అనే వ్యక్తిని డ్రగ్స్ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు.
It’s so sad that our talented media has no news than to start circulating old #fakenews. Our dear journalists especially the self proclaimed news sites and your articles, why don’t you actually start doing some real journalism! Stop finding flaws with your celebtrities, we are…
— 𝑽𝒂𝒓𝒂𝒍𝒂𝒙𝒎𝒊 𝑺𝒂𝒓𝒂𝒕𝒉𝒌𝒖𝒎𝒂𝒓 (@varusarath5) March 14, 2024
ఇప్పుడు దానికి సంబంధించిన విషయంలో వరలక్ష్మికి పోలీసులు సమన్లు జారీ చేసినట్టు..ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారంటూ సోషల్ మీడియాలో ఓ ఫేక్ వార్త వైరల్ అవుతుంది. తాజాగా దీనిపై వరలక్ష్మి శరత్ కుమార్ స్పందించింది. మీడియా వాళ్లకు నేను తప్ప వేరే వారు దొరకడం లేదనుకుంటా ..నా గురించి ఎప్పుడో వచ్చిన ఫేక్ వార్తలను ఇప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడింది. అలాగే సమాజంలో చాలా సమస్యలు ఉన్నాయి.. వాటి గురించి పోరాడండి. నా మౌనాన్ని చేతకాని తనంగా చూడకండి. నిజాలు తెలుసుకోండి. అసత్య ప్రచారాలు మానేయండి అంటూ ఓ ట్వీట్ చేసింది.












Click it and Unblock the Notifications