'వారణాసి' మూవీ నుంచి లీకైన పిక్.. సోషల్ మీడియా షేక్..
సూపర్ స్టార్ మహేష్ బాబు- దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'వారణాసి'.. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 7 న ప్రపంచ వ్యాప్తంగా 120 కు పైగా దేశాల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో రుద్ర అనే శక్తివంతమైన పాత్రలో మహేశ్ బాబు నటిస్తున్నారు. అలాగే మహేశ్ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నటిస్తోంది. ఇక మలయాళం నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ నెగిటివ్ రోల్ కుంభ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు ఎం. ఎం. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. వారణాసి చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కే. ఎల్. నారాయణ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.
అయితే రాజమౌళి తన చిత్రాలను ఎంతో గోప్యంగా ఉంచుతూ షూటింగ్ చేస్తుంటారు. భారీ స్థాయిలో పాన్ వరల్డ్ రేంజ్ లో ఆయన సినిమాలు తెరకెక్కించినా కొంచెం కూడా లీక్ కాకుండా జాగ్రత్తపడుతుంటారు. ఇక వారణాసి మూవీ విషయానికి వస్తే ఈ మూవీ షూటింగ్, అప్డేట్లను చాలా గోప్యంగా ఉంచుకుంటూ వచ్చారు జక్కన్న. అసలు ఈ మూవీ ముహూర్తం వేడకకు సంబంధించి కూడా ఇప్పటివరకూ ఒక్క పిక్ కూడా బయటకు రాలేదు. అలా వారణాసి చిత్రాన్ని కొంత షూటింగ్ పూర్తి చేసిన తర్వాత గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ అనే పేరుతో టైటిల్ రివీల్, గ్లింప్స్ కార్యక్రమం నిర్వహించారు.
ఒక సినిమాకు ఎంత హైప్ ఇవ్వాలో అనేది రాజమౌళికి పక్కాగా తెలుసు.. కానీ ఆయన ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వారణాసికి సంబంధించి ఏదో ఒక అంశం నిత్యం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంటుంది. తాజాగా వారణాసి చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ లీకైన పిక్ లో పురాతన ఆలయం, భారీ డైనోసార్ ఆకారం ఇప్పుడు కనువిందు చేస్తోంది. పవిత్రమైన ఆలయం వద్ద భారీ డైనోసార్ ఉండటం ఏంటని నెటిజన్లు తలపట్టుకుంటున్నారు.

మరి జక్కన్న ఏం ప్లాన్ చేశారో అని ఎవరికి తూచిన విధంగా వారు అంచనాలు వేసుకుంటున్నారు. ఏదైనా వారణాసి మూవీ రిలీజ్ అయ్యాకే ఈ చిత్రంపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు వారణాసి మూవీకి సంబంధించిన మరో వార్త కూడా నెట్టింట చక్కర్లు కొడుతోంది. వారణాసి క్లైమాక్స్ లో భారీ ట్విస్ట్ ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. అసలు ఆ ట్విస్ట్ ఏంటి అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.












Click it and Unblock the Notifications
