తెలుగులో హీరోలు లేరా.. మళ్లీ తమిళ నటుడి తోనే సినిమా చేస్తున్న వెంకీ అట్లూరి
తెలుగు చిత్ర పరిశ్రమలోని యంగ్ డైరెక్టర్ లలో వెంకీ అట్లూరి కూడా ఒకరు. లవ్ స్టోరీస్, విభిన్న కథాంశాలతో సినిమాలను తెరకెక్కించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మొదటి సినిమా తొలిప్రేమతో మంచి హిట్ అందుకున్నారు. ఆ తర్వాత అఖిల్ తో చేసిన మిస్టర్ మజ్ను, నితిన్ తో చేసిన రంగ్ దే సినిమాలు ఆశించిన మేరకు విజయాన్ని అందుకోలేకపోయాయి. ఈ రెండు సినిమాల ఫలితాల రూట్ మార్చాడు ఈ దర్శకుడు.
తెలుగు హీరోలను పక్కన పెట్టి కోలీవుడ్, మాలీవుడ్ హీరోలతో సినిమాలు చేయడం ప్రారంభించారు. తమిళ్ స్టార్ హీరో ధనుష్‌తో చేసిన 'సార్', మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌తో 'లక్కీ భాస్కర్' మంచి హిట్స్ అందుకున్నాయి. ఇక ఇప్పుడు తన కొత్త సినిమాను మరో తమిళ్ హీరోతో అనౌన్స్ చేశాడు వెంకీ. గత కొద్దిరోజులుగా వీరి కాంబినేషన్ లో సినిమా రాబోతుందని గుసగుసలు వినిపిస్తుండగా ఈరోజు అఫిషియల్ గా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.

స్టార్ హీరో సూర్య - వెంకీ అట్లూరి కాంబినేషన్ లో సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో జరిగిన ఈ లాంచింగ్ కార్యక్రమానికి చిత్రబృందం హాజరైంది. ఈ ప్రాజెక్టును సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై క్లాప్ కొట్టారు.
ఇక ఈ చిత్రంలో ప్రేమలు బ్యూటీ మమితా బైజు.. హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది. అలానే జీవీ ప్రకాష్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చనున్నారు. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన ఆకాశమే నీ హద్దురా భారీ విజయాన్ని దక్కించుకుంది. ఈ క్రమంలోనే మరోసారి వెంకీ అట్లూరి తెలుగు హీరోలతో ఎందుకు సినిమాలు చేయడం లేదని కామెంట్స్ వస్తున్నాయి. పక్క భాషలకు చెందిన హీరోలతోనే సినిమాలు చేయడానికి కారణమ ఏంటి ?తెలుగులో వెంకీ కథలకు న్యాయం చేసే హీరోలు లేరా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
The most anticipated #Suriya46 has been officially launched with a grand pooja ceremony! 🔥@Suriya_offl x #VenkyAtluri unite to create magic on screen! 💥💥
— Sithara Entertainments (@SitharaEnts) May 19, 2025
Thank you #Trivikram garu for gracing and marking the beginning of this journey with the first clap 🎬
🎬 Shoot begins… pic.twitter.com/is7MhRkVAF
రీసెంట్ గానే కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన రెట్రో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సూర్య. బుట్టబొమ్మ పూజా హెగ్డే ఆ సినిమాలో హీరోయిన్ గా నటించింది. అయితే ఆ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. దీంతో ఇప్పుడు సూర్య ఆశలన్నీ వెంకీ సినిమా పైనే పెట్టుకున్నట్టు సమాచారం.
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే! -
మీకు అర్థమవుతోందా?.. ‘ధురంధర్2’ తీయడం వెనక పక్కా రాజకీయ వ్యూహం -
ఐ లవ్డ్ ధురంధర్ 1.. బట్ - జక్కన్న సెన్సేషన్ రివ్యూ: అలాంటి హీరోలందరినీ చంపేసింది -
కుటుంబ సభ్యులతో కలిసి "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ చూసిన మెగాస్టార్.. -
సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే? -
ఉస్తాద్‌కు ధురంధర్ డెంటు పెట్టేసాడుగా..! -
త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న తెలుగు హీరోయిన్.. వైజాగ్‌లో సందడి !! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
స్టార్ బ్యూటీతో కలిసి సైలెంట్‌గా ఓటీటీ డెబ్యూ ఇస్తున్న యంగ్ హీరో !! -
బన్నీ మూవీలో ఐదుగురు భామలా? అట్లీ స్కెచ్ మామూలుగా లేదుగా! -
ఉస్తాద్‌కు బిగ్ షాక్...తొలి రోజే ఆన్లైన్లో HD ప్రింట్ ప్రత్యక్షం!












Click it and Unblock the Notifications