విజయ్ దేవరకొండ- రష్మిక అఫీషియల్ అనౌన్స్ మెంట్: మస్త్ స్టఫ్
Vijay Devarakonda and Rashmika Mandanna: విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న రిలేషన్ షిప్ లో ఉన్నారనే వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తోన్నాయి. దీన్ని నిజం చేస్తూ గతంలో ముంబై ఎయిర్ పోర్ట్ లో ఒకే కారులో ట్రావెల్ చేస్తూ కెమెరా కంటికీ చిక్కారు. రిలేషన్ షిప్ వార్తలను తోసిపుచ్చకపోవడం ఈ అనుమానాలకు మరింత బలాన్ని ఇచ్చింది.
ఈ పరిస్థితుల మధ్య విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న కలిసి అమెరికా టూర్ కు వెళ్లనున్నారు. ఈ మేరకు వారికి ఆహ్వానం సైతం అందింది. ఈ విషయాన్ని వారిద్దరు అధికారికంగా వెల్లడించారు. ఆగస్టులో అమెరికా వెళ్లనున్నట్లు తెలియజేశారు. ఈ మేరకు తమ అధికారిక సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ పై ఓ వీడియోను పోస్ట్ చేశారు.

న్యూయార్క్‌లో జరగనున్న ఇండియా డే పరేడ్ కు విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న గ్రాండ్ మార్షల్స్ గా ఎంపిక అయ్యారు. వారిద్దరూ ఈ పరేడ్ ను లీడ్ చేయనున్నారు. దేవ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 15వ తేదీన అమెరికాలో జరిగే వేడుకల్లో పాల్గొననున్నారు.
అదే నెల 17వ తేదీన మాడిసన్ అవెన్యూ మార్గ్ లో జరిగే ఇండియా డే పరేడ్‌కు విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న లీడ్స్ గా వ్యవహరించనున్నారు. వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్ షిప్ పై వార్తలు వస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో జాయింట్ గా అమెరికా వెళ్లబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
చాలా కాలం తర్వాత ఓ బహిరంగ కార్యక్రమంలో కలిసి కనిపించబోతోండటం ఇదే మొదటిసారి అవుతుంది. ఆగస్టు 17వ తేదీన న్యూయార్క్ లో జరిగే ఇండియా డే పరేడ్ కు గ్రాండ్ మార్షల్ గా వ్యవహరించబోతోండటం తనకు దక్కిన అరుదైన గౌరవంగా పేర్కొన్నారు విజయ్ దేవరకొండ.
ఆగస్టు 15వ తేదీన జరిగే ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొనబోతోన్నానని, అమెరికాలో నివసించే భారతీయులు, ప్రత్యేకించి- తెలుగు ప్రజలతో కలిసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకోబోతోండటం గర్వకారణమని అన్నారు. విదేశీ గడ్డపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తోన్నానని విజయ్ దేవరకొండ చెప్పారు.
రష్మిక మందన్న కూడా దీనికి సంబంధించిన ఓ వీడియోను పోస్ట్ చేశారు. వివిధ భాషల్లో ఆమె తన అభిమానులు, ఫాలోవర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆగస్టు 17న న్యూయార్క్ నగరంలో జరిగే అతిపెద్ద ఇండియా డే పరేడ్‌కు గ్రాండ్ మార్షల్ గా వ్యవహరించబోతోన్నానని వెల్లడించారు.
ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ (FIA).. ప్రతి సంవత్సరం కూడా న్యూయార్క్ లో ఇండియా డే పరేడ్ ను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది నిర్వహించబోయేది 43వ ఇండియా డే పరేడ్. గ్రాండ్ మార్షల్స్ ను ఎంపిక చేయడంలో కౌంట్ డౌన్ ఆరంభమైంది.
ఈ ఏడాది పరేడ్ కు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నాయకత్వం వహించనున్నారని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ప్రకటించింది. న్యూయార్క్ లోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమం సందర్భంగా గ్రాండ్ మార్షల్స్ పేరును రివీల్ చేశారు.
-
అమెరికా పరువుతీసిన పాకిస్థాన్.. మంత్రి సంచలన ట్వీట్! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications