విజయ్ దేవరకొండ విడాకుల ప్రచారం.. ఒక్క కిస్ ఫోటోతో సంచలనం!

టాలీవుడ్ ప్రముఖ నటి రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండల ప్రేమ, పెళ్లి బంధంపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు, ట్రోలింగ్ చేస్తున్న వారికి విజయ్ దేవరకొండ గట్టి షాకిచ్చారు. రష్మిక-విజయ్ దేవరకొండ విడాకులు తీసుకుంటారని జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పందించారు. ఇటీవల రష్మిక 8 పేజీల సుదీర్ఘ లేఖ ద్వారా ట్రోలర్లకు సమాధానం ఇవ్వగా.. తాజాగా ఆమె భర్త విజయ్ దేవరకొండ కూడా రంగంలోకి దిగారు. భార్య రష్మికపై ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తూనే.. నెగెటివిటీని వ్యాప్తి చేసేవారిపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ప్రభాస్ 'ఫౌజీ'కి ఊహించని షాక్: నేతాజీ మనవడి తీవ్ర అభ్యంతరం!
ప్రభాస్ 'ఫౌజీ'కి ఊహించని షాక్: నేతాజీ మనవడి తీవ్ర అభ్యంతరం!

విజయ్ దేవరకొండ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో రష్మికతో ఉన్న ఓ రొమాంటిక్ ఫోటోను, వీడియోను పంచుకున్నారు. అందులో రష్మిక ఆయన నుదుటిపై ప్రేమగా ముద్దు పెడుతుండగా.. వీడియోలో విజయ్ తన భార్యను భుజాలపై ఎత్తుకుని ఇంట్లో సరదాగా తిరుగుతూ కనిపించారు. ఈ ఫోటోలతో పాటు విజయ్ దేవరకొండ రాసుకొచ్చిన సందేశం ప్రస్తుతం నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Vijay Deverakonda Divorce Rumors Actor Slams Trolls With Romantic Kiss Picture and giving a fiery response

"నా బెస్ట్ ఫ్రెండ్, నా భార్య, నా జీవితంలో ముఖ్యమైన మహిళ. నా జీవితంలో నేను ఎంచుకున్న అత్యంత అందమైన భాగం ఆమె" అని విజయ్ పేర్కొన్నారు. తమ బంధం గురించి అనవసరంగా ఆందోళన చెందుతున్న వారికి స్పందిస్తూ.. "మా గురించి వర్రే అయ్యే వారికి ఒక్కటే చెబుతున్నా.. మేమిద్దరం చాలా చాలా సంతోషంగా ఉన్నాం. నా జీవితంలో ఆమె ఉండటం నేను చేసుకున్న అదృష్టం. ఒకవేళ ఈ ప్రపంచమంతా మాకు వ్యతిరేకంగా నిలబడినా, మేమిద్దరం కలిసి ఎదుర్కొంటాం " అని విజయ్ దేవరకొండ స్పష్టం చేశారు. తమ సంతోషాన్ని కోరుకునే వారికి ధన్యవాదాలు తెలిపిన ఆయన ట్రోలర్లను ఉద్దేశించి.. "ఇక అనవసరంగా వాగేవారంతా భారాన్ని పక్కనపెట్టి తమ పని తాము చూసుకుంటే మంచిది" అంటూ విజయ్ ఘాటు వ్యాఖ్యలతో ముగించారు.

నాటు నాటు సింగర్‌తో సెన్సేషన్.. డెబ్యూ సినిమాకే ఇంటర్నేషనల్ ప్రమోషన్స్!
నాటు నాటు సింగర్‌తో సెన్సేషన్.. డెబ్యూ సినిమాకే ఇంటర్నేషనల్ ప్రమోషన్స్!

గతంలో కరణ్ జోహార్ షోలో రష్మిక మందన్న మాట్లాడుతూ.. పెళ్లి కోసం విజయ్‌ను దాదాపు 100 సార్లు ఒప్పించాల్సి వచ్చిందని సరదాగా వ్యాఖ్యానించారు. దీన్ని పట్టుకుని కొందరు నెటిజన్లు విజయ్ దేవరకొండను 'రెడ్ ఫ్లాగ్' అని.. రష్మిక్ వేరే మంచి భాగస్వామిని ఎంచుకోవాలని కామెంట్లు చేశారు. దీనిపై ఇప్పటికే రష్మిక క్లారిటీ ఇస్తూ.. కష్టసమయాల్లో సోషల్ మీడియా విమర్శకులు కాదు, విజయ్ మాత్రమే తనతో నిలబడ్డాడని స్పష్టం చేశారు. తాజాగా విజయ్ ఇచ్చిన ఈ స్ట్రాంగ్ కౌంటర్‌తో ట్రోలర్ల నోళ్లు మూతపడినట్లయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+