రిజల్ట్ ఎలా ఉన్నా.. హార్ట్ బ్రేక్ తప్పదు
SS Rajamouli: ఐపీఎల్ 2025.. ఫైనల్స్ ఎవరో తేలిపోయింది. క్వాలిఫయర్ 1 సీన్.. ఇక్కడ కాబోతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పంజాబ్ కింగ్స్ ఢీ కొట్టబోతోంది. మంగళవారమే ఫైనల్ గేమ్. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం దీనికి వేదిక. సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది.
ఆదివారం రాత్రి జరిగిన క్వాలిఫయర్ 2లో పంజాబ్ కింగ్స్ విజయఢంకా మోగించింది. అయిదు వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ ను మట్టికరిపించింది. ఊహించినట్టే- ముంబై ఇండియన్స్ బౌలర్లు ఈ మ్యాచ్ లో ఘోరంగా విఫలం అయ్యారు. 203 పరుగుల భారీ స్కోర్ ను కాపాడుకోలేకపోయారు.

తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. నిర్ణీత 20 ఓవర్లల్లో 203 పరుగులు చేయగా.. దాన్ని కొట్టిఅవతల పడేసింది పంజాబ్. ఇంకా ఓ ఓవర్ మిగిలివుండగానే 207 పరుగులు కొట్టింది. ఈ క్రమంలో అయిదు వికెట్లను కోల్పోయింది. 72 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయినప్పటికీ- ఏ మాత్రం వెనుకంజ వేయలేదా జట్టు.
పంజాబ్ కింగ్స్ కేప్టెన్ శ్రేయాస్ అయ్యర్.. నాయకుడిగా జట్టును ముందుండి నడిపించాడు. 41 బంతుల్లో ఎనిమిది భారీ సిక్సర్లు, అయిదు ఫోర్లతో 87 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఇంగ్లీస్.. 21 బంతుల్లో రెండు సిక్సర్లు, అయిదు ఫోర్లతో 38, నెహాల్ వధేరా.. 29 బంతుల్లో రెండు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 48 పరుగులు జట్టును విజయతీరాలకు చేర్చాయి.
పంజాబ్ సాధించిన విజయం పట్ల టాలీవుడ్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌలి స్పందించారు. ప్రత్యేకించి- కేప్టెన్ శ్రేయాస్ అయ్యర్ పై ప్రశంసల వర్షాన్ని కురిపించాడు. అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని కితాబిచ్చాడు. జట్టు ఫైనల్స్ చేరడానికి అతని బ్యాటింగ్, కేప్టెన్సీ ప్రధాన కారణమని వ్యాఖ్యానించాడు. ఈ మేరకు ఓ ట్వీట్ పోస్ట్ చేశాడు.
ముంబై ఇండియన్స్ బౌలర్లు జస్ ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ యార్కర్లను అయ్యర్.. థర్డ్ మ్యాన్ దిశగా బౌండరీకి తరలించిన సీన్ అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారు. యార్కర్లను ఆడిన తీరు ఆశ్చర్యానికి గురి చేసిందని పేర్కొన్నాడు. శ్రేయాస్ అయ్యర్ జట్టును ఫైనల్ దిశగా నడిపించాడని మెచ్చుకున్నాడు.
గతంలో ఢిల్లీ కేపిటల్స్, ఆ తరువాత కోల్ కత నైట్ రైడర్స్ కు ఎన్నో విజయాలను అందించాడని, ఇప్పుడు పంజాబ్ కింగ్స్ తరఫున టైటిల్ సాధించే దిశగా ప్రయాణిస్తున్నాడని రాజమౌలి చెప్పాడు. ఈ ఐపీఎల్ సీజన్ ట్రోఫీ అందుకోవడానికి అతను అర్హుడని పేర్కొన్నాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీ పైనా ప్రశంసలు కురిపించాడు రాజమౌలి. ఈ ఏడాది కూడా సత్తాచాటుతున్నాడని, కేరీర్ చివరి దశలో కోహ్లీ ఉన్నాడని పేర్కొన్నాడు. ఐపీఎల్ 2025 కప్ అందుకోవడానికి అతను కూడా పూర్తిగా అర్హుడని, ఫైనల్ రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ హార్ట్ బ్రేక్ మాత్రం తప్పదని చెప్పాడు.
Iyer guiding Bumrah’s and Boult’s yorkers to the third man boundary… Exquisite…
— rajamouli ss (@ssrajamouli) June 2, 2025
This man leads Delhi to a final… and is dropped…
Leads Kolkata to a trophy… dropped…
Leads a young Punjab to the finals after 11 years.
He deserves this year’s trophy too…
On the other hand,… pic.twitter.com/ws0anhcZ3l
రాజమౌలి చేసిన ఈ ట్వీట్ కు పంజాబ్ కింగ్స్ స్పందించింది. శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్ బ్లాక్ బస్టర్‌లలో ఒకటిగా నిలిచిన బాహుబలిని తలపించిందని పేర్కొంది. అతని నాయకత్వం ఆర్ఆర్ఆర్ మాదిరిగా, ఈగ తరహా కమ్ బ్యాక్ ఉందని తెలిపింది. క్లైమాక్స్ లోడింగ్ లో ఉందని.. ఓ మాస్టర్ స్టోరీ టెల్లర్ గా మీకు నచ్చుతుందని అభిప్రాయపడింది.












Click it and Unblock the Notifications