Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇండియాలో నెంబర్‌వన్ హీరో ఎవరు?

భారతదేశంలో ప్రస్తుతం నెంబర్‌వన్ హీరో ఎవరు? అనే ఆసక్తికరమైన చర్చ సినీ పరిశ్రమలో నడుస్తోంది. బాలీవుడ్ లో మంచి హిట్లు సాధించే హీరోలే దేశంలో నెంబర్ వన్ హీరోలుగా చెలామణి అయ్యేవారు. మిగతా భాషలకు చెందినవారంతా ప్రాంతీయ హీరోలుగా ఉండేవారు. అయితే రాజమౌళి రూపంలో ఎప్పుడైతే తెలుగు సినీ పరిశ్రమ నుంచి బాహుబలి, ఆర్ఆర్ఆర్, కన్నడం నుంచి కేజీఎఫ్, మళయాళం నుంచి దృశ్యం, తమిళం నుంచి జైలర్, విక్రమ్ లాంటి సినిమాలు ఎప్పుడైతే వచ్చాయో అప్పటి నుంచి హీరోలకు కొలమానం మారిపోయింది.

వెనకబడ్డ ఖాన్ త్రయం
బాహుబలి తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా హీరో అయిపోయారు. తెలుగు, తమిళం అనే కాకుండా అన్ని భారతీయ భాషల్లో ప్రభాస్ కు అభిమానులున్నారు. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ లాంటి సినిమాలు వచ్చి ఫ్లాపైనా కలెక్షన్లు మాత్రం భారీస్థాయిలో వచ్చాయి. ప్రభాస్ సినిమా అనగానే మొదటి మూడు రోజుల్లో రూ.300 కోట్లు వసూలు చేయడం సర్వసాధారణమైపోయింది. ప్రభాస్ స్టామినా ముందు సల్మాన్ ఖాన్, అమిర్ ఖాన్, షారుక్ ఖాన్ లాంటివారంతా వెనకబడిపోయారు. డార్లింగ్ సినిమా వస్తోందంటూ అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్ లాంటి హీరోలు కూడా తమ సినిమాల విడుదల తేదీలను మార్చుకుంటున్నారు.

who is the number one hero in indian film industry

భారీ బడ్జెట్ తోనే చిత్రాలు
ఇండియాలో ప్రభాస్ తో సినిమా తీయాలంటే తక్కువలో తక్కువగా రూ.400 కోట్ల నుంచి రూ.500 కోట్ల బడ్జెట్ అవుతోంది. అంత పెట్టుబడి పెట్టడానికి నిర్మాతలు కూడా సిద్ధంగా ఉంటున్నారు. సినిమా పర్వాలేదు అన్న చిన్న మాట వచ్చినా చాలు కలెక్షన్ల వర్షం కురిపిస్తాడు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న రాజాసాబ్, కల్కి, సలార్ 2, స్పిరిట్ సినిమాల బడ్జెట్ కూడా భారీగా ఉంటోంది. ప్రభాస్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటివారికి కూడా ఉత్తర భారతదేశంలో భారీ ఫాలోయింగ్ పెరిగింది.

ప్రభాస్ ఒక్కడే
ఇకనుంచి వీరు చేసే సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలో, బాలీవుడ్ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకొని తీయాల్సి వస్తోంది. అందుకనుగుణంగానే వీరంతా దర్శకులను ఎంపిక చేసుకుంటున్నారు. ప్రభాస్ రెమ్యునరేషన్ అందరికన్నా ఎక్కువగా ఉంటోంది. ఒక్కో సినిమాకు రూ.120 నుంచి రూ.150 కోట్లు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. అదీ కాకుండా లాభాల్లో వాటా కూడా ఉంటే మరింతగా పారితోషికం పెరిగినట్లే. ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా అన్ని చిత్ర పరిశ్రమల నుంచి కథానాయకులను పోల్చితే డార్లింగ్ ప్రభాస్ ఒక్కడే ఇండియా నెంబర్ వన్ హీరో అని చెప్పొచ్చు అంటున్నారు సినీ విశ్లేషకులు. ఒకరకంగా ఇది డార్లింగ్ అభిమానులకు తియ్యటివార్తే.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+