ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ మూవీ.. వీళ్లు అస్సలు మిస్ అవ్వొద్దు..!
ఇటీవలికాలంలో ఓటీటీలో చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ముఖ్యంగా చిన్న సినిమాలు అటు థియేటర్లలోనూ.. ఇటు ఓటీటీల్లోనూ రచ్చ లేపుతున్నాయి. యువ నటీనటులు ఉండటం.. కథలో కొత్తదనం ఉండటం అన్నింటికీ మించి సినిమాపై ఎలాంటి అంచనాలు లేకపోవడంతో ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి. తెలుగులోనూ గతేడాది చాలా చిన్న సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజై బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యాయి. తెలుగుతోపాటు అటు తమిళం, మలయాళం, కన్నడ ఇండస్ట్రీలోనూ చిన్న సినిమాలదే హవా..
అయితే ఇటీవల తమిళంలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయం సాధించిన మూవీ 'విత్ లవ్'.. ఎలాంటి అంచనాలు లేకుండా కోలీవుడ్ లో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. రూ.36 కోట్ల భారీ వసూళ్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి విడుదల అయ్యేందుకు సిద్ధం అవుతోంది. ఈ మేరకు నెట్ ఫ్లిక్స్ లో మార్చి 6 నుంచి స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది. 'విత్ లవ్' మూవీ తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లోనూ విడుదల కానుంది.
ఈ మూవీలో అభిషన్ జీవింత్, అనస్వర రాజన్ జంటగా నటించారు. ఈ మూవీ యూత్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. దర్శకుడు మదన్ టేకింగ్, షాన్ రోల్డన్ సంగీతం సినిమాకు హైలెట్ గా నిలిచాయి. అయితే ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించేందుకు సిద్ధం అవుతోంది. మార్చి 6 న తెలుగులోనూ స్ట్రీమింగ్ కు రానుంది. థియేటర్లలో ఇటీవల మంచి విజయాన్ని అందుకున్న ఈ మూవీ.. ఈ వారమే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. తక్కువ బడ్జెట్ లో మూవీ రిలీజ్ అయినా కూడా బాక్సాఫీస్ దగ్గర రూ.36 కోట్లు వసూలు చేయడం విశేషం.

'విత్ లవ్' మూవీ కథ చాలా కొత్తగా ఉంటుంది. స్కూల్ రోజుల్లో తాము ఇష్టపడిన వ్యక్తులను వెతికి పట్టుకుని.. అప్పట్లో చెప్పలేకపోయిన తమ మనసులోని మాటను ఇప్పుడు చెప్పాలని ఒక ప్రయాణం స్టార్ట్ చేస్తారు. ఈ జర్నీలో వారికి ఎదురైన అనుభవాలు, పాత ప్రేమలు ఏమైనాయి.. అనేదే ఈ చిత్ర కథనం. కొత్త దర్శకుడు మదన్ ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించాడు. ఇక ఈ సినిమాకు షాన్ రోల్డన్ సంగీతం ప్రధాన బలం. అలాగే ఈ మూవీలో లీడ్ యాక్టర్స్ తో పాటుగా హరీష్, కావ్య అనిల్, శరవణన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.












Click it and Unblock the Notifications