జంగిల్ అడ్వెంచర్: మళ్లీ డిజాస్టర్ డైరెక్టర్‌కే యష్ పచ్చజెండా?

టాక్సిక్ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో కన్నడ స్టార్ హీరో యష్ తన తదుపరి సోలో సినిమాను ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్-ఇండియా సినిమా 'రామాయణ'లో రావణుడి పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమిళ డైరెక్టర్ పీఎస్ మిత్రన్ చెప్పిన ఓ కథకు యష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్తలు సినీ వర్గాల్లో ప్రచారంలో ఉన్నాయి.

రామాయణ మూవీ అఫీషియల్ రిలీజ్ డేట్ వచ్చేసింది
రామాయణ మూవీ అఫీషియల్ రిలీజ్ డేట్ వచ్చేసింది

'ఇరుంబు తిరై'(తెలుగులో అభిమన్యుడు), 'సర్దార్' వంచి సినిమాలతో గుర్తింపు పొందిన పీఎస్ మిత్రన్ ఇటీవల యష్‌కు ఓ అడవి నేపథ్యం కలిగిన అడ్వెంచర్ కథను వినిపించినట్లు తెలుస్తోంది. కథ నచ్చడంతో యష్ ఈ ప్రాజెక్టుకు ఓకే చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. 'ఇండియానా జోన్స్' తరహాలో సాగే ఈ పాన్-ఇండియా ప్రాజెక్టును మొదటి సంజయ్ లీలా భన్సాలీ నిర్మించాల్సి ఉందని, ధనుష్ కథానాయకుడిగా అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆయన తప్పుకోవడంతో ఆ అవకాశం యష్ దగ్గరకు వచ్చిందని సమాచారం.

Yash to Team Up with PS Mithran for a Jungle Adventure Film Here is What We Know Full Details

అంతే కాకుండా ముందుగా ఈ స్టోరీని రామ్‌చరణ్ కోసం సిద్ధం చేశారని, కాల్ షీట్ల సమస్యల కారణంగా ఆయన చేయలేకపోవడంతో ధనుష్ దగ్గరకు, ఆ తర్వాత యష్ వద్దకు చేరిందని సమాచారం. ఈ వార్తలపై సోషల్ మీడియాలో మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొంత మంది నెటిజన్లు ఇది చాలా కొత్త కాన్సెప్ట్ అని, రాకీ భాయ్ ఇమేజ్ నుంచి యష్ బయటపడటానికి ఇది మంచి అవకాశమని అభిప్రాయపడుతున్నారు. అయితే మరికొందరు మాత్రం యష్ ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పీఎస్ మిత్రన్ ఇప్పటివరకు తీసిన నాలుగు సినిమాల్లో రెండు హిట్ అవ్వగా.. ఆయన ఇటీవల తీసిన 'సర్దార్ 2'తో సహా మిగతా రెండు సినిమాలు భారీ డిజాస్టర్లుగా మిగిలాయని గుర్తు చేస్తున్నారు. ట్రాక్ రికార్డ్ అంతగా లేని దర్శకుడితో యష్ వంటి పాన్-ఇండియా స్టార్ సినిమా చేయడం ముప్పుతో కూడుకున్నదని కామెంట్స్ చేస్తున్నారు.

10 రోజుల్లో రూ. 500 కోట్లా.. ఈ సినిమా బాక్సాఫీస్ ర్యాంపేజ్ బాసూ..!
10 రోజుల్లో రూ. 500 కోట్లా.. ఈ సినిమా బాక్సాఫీస్ ర్యాంపేజ్ బాసూ..!

ఏది ఏమైనప్పటికీ.. ఇవన్నీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాలు మాత్రమే. దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మిత్రన్-యష్ కాంబినేషన్ నిజంగానే పట్టాలెక్కుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+