యాత్ర 2 టీజర్ డేట్ ఫిక్స్.. ప్రతిపక్షాలకు దబిడి దిబిడే
యాత్ర 2 సినిమాకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. సినిమా టీజర్ డేట్‌ను దర్శకుడు మహీ వి.రాఘవ్ ప్రకటించారు. యాత్ర 2 సినిమా టీజర్ జనవరి 5వ తేదీన ఉదయం 11 గంటలకు రిలీజ్ చేయనున్నట్టు దర్శకుడు మహీ వి.రాఘవ్ వెల్లడించారు. దీనికి సంబంధించి టీజర్ పోస్టర్‌ను ఆయన విడుదల చేశారు.
ఈ పోస్టర్‌లో మమ్మూటి కుర్చీలో కూర్చొని ఉండగా.. జీవా ఆయన వెనుక నిలబడిన పోస్టర్‌ను మహీ వి.రాఘవ్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. 2019 ఎన్నికల ముందు యాత్ర 1 విడుదలైంది.దివంగత నేత వైఎస్ఆర్ రాజకీయ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన యాత్ర బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. మళయాళ సూపర్ స్టార్ యాత్ర సినిమాలో వైఎస్ఆర్‌గా కనిపించి మెప్పించారు.

ముఖ్యంగా వైఎస్ఆర్ అభిమానించే ప్రతి ఒక్కరికి యాత్ర సినిమా గుండెలకు హత్తుకునేలా చేసింది. ఈ సినిమాకు కొనసాగింపుగా యాత్ర 2ను అనౌన్స్ చేశాడు దర్శకుడు మహీ వి.రాఘవ్. మొదటి పార్ట్‌లో వైఎస్ఆర్ గురించి చూపించగా, యాత్ర 2లో ఆయన తనయుడు జగన్ గురించి చూపించనున్నారు.
వైఎస్ఆర్ మరణం తరువాత చోటు చేసుకున్న సంఘటనలతో పాటు, జగన్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రావడం.. సొంతంగా పార్టీ పెట్టడం, పాదయాత్ర వంటి అంశాలను యాత్ర 2లో చూపించనున్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాత్రను తమిళ నటుడు జీవా పోషించగా, ఆయన సతిమణి వైఎస్ భారతిగా కేతకి నారాయణ్, సోనియా గాంధీ పాత్రలో జర్మనీ నటి సుజానే బెర్నెట్ నటిస్తున్నారు.
One man, a million odds, yet the promise had to be kept!#Yatra2Teaser on Jan 5th 👣 pic.twitter.com/ve9UoDDIw9
— kumar (@varunsarshi143) January 2, 2024
మహేశ్ మంజ్రేకర్, రాజీవ్ కుమార్ అనేజా కీలకపాత్రల్లో కనిపించనున్నారు. యాత్ర 2 టీజర్ వచ్చే శుక్రవారం విడుదల కానుండటంతో ప్రతిపక్షాలు సైతం ఈ సినిమాపై కన్నేశాయి.యాత్ర 2 సినిమా మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా ఈ సినిమాపై ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. తాజాగా టీజర్ విడుదల డేట్ ఫిక్స్ కావడంతో ప్రతిపక్షాలు వణికిపోతున్నాయి. యాత్ర 2ను ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.












Click it and Unblock the Notifications